సంక్రాంతికి ముందే రిలీజ్

సంక్రాంతి పండగ దగ్గరపడుతున్నకొద్దీ సినిమా వాళ్ల హడావుడి కూడా ఊపందుకుంటోంది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాల మధ్య కాంపిటేషన్ బాగానే ఉండేట్టు ఉంది. తీస్తున్న సినిమాలు అప్పటికి పూర్తి చేసి రిలీజ్ అయ్యేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ పోటీలో లేటెస్ట్ గా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

సంక్రాంతికి రిలీజయ్యే బాలకృష్ణ 100వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ .. ..  సంక్రాంతి సెలవులు అంతకు రెండు మూడు రోజుల ముందే ప్రారంభమవుతాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా ముందే రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

సంక్రాంతి సెలవులు ఇచ్చినప్పటి నుంచే శాతకర్ణి  సినిమా థియేటర్లలో వుంటే బాగుంటుందని బయ్యర్లు ఆలోచించి  రెండు రోజుల ముందుగానే విడుదల చేయమని మూవీ మేకర్స్ ను వత్తిడి చేస్తున్నారట. సో .. .. శాతకర్ణి ముందే విడుదలకావచ్చని తెలుస్తోంది. ఈ ఆలోచనకు మరో కారణం కూడా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ, ఖైదీ నంబర్ 150 విడుదలపై కూడా పునరాలోచన వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది  జనవరి 13న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ 11వ తేదీనే రిలీజ్ చేయాలని ఇప్పుడు అనుకుంటున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ  ప్రయత్నాలు తెలిసిన తర్వాతే శాతకర్ణి ని కూడా ముందుగానే విడుదల చేయాలని  ఆలోచించారని అంటున్నారు.

ఒకవేళ బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 విడుదల తేదీలు మారితే రెండూ ఒకే రోజు రిలీజయ్యే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.