శాతకర్ణికి కొత్త తరహా ప్రచారం

సినిమా తీయగానే సరిపోదు. నిర్మాణం ఒక కీలక ఘట్టమైతే .. .. పబ్లిసిటీ మరో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎంత మంచి సినిమా తీసినా పబ్లిసిటీ లేకపోతే జనానికి తెలీదు. చూసేందుకు థియేటర్లకు రారు. ఆ పబ్లిసిటీలో కూడా ఇప్పుడు రకరకాల మెథడ్స్ వచ్చాయి. వెరైటీగా చేస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాకు కూడా అలా డిఫరెంట్ గా పబ్లిసిటీ చేస్తున్నారు.

పేరున్న నటీనటులు నటించే భారీ చిత్రాలకు నిర్మాణంలో ప్రతి దశలోనూ ప్రచారం లభిస్తుంటుంది. ఆడియో ఫంక్షన్లు, టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ వంటివి కూడా పబ్లిసిటీలో భాగమే. ఇంక కొన్ని సినిమాలకైతే ప్రత్యేకంగా ప్రమోషన్ టూర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టూర్స్ మాత్రమే కాకుండా రజనీకాంత్ కబాలికి చాలా డిఫరెంట్ గా పబ్లిసిటీ ఇచ్చారు.

కబాలి కి ఎవరూ చేయని విధంగా విమానాలపై పెయింటింగ్స్ తో ఆ సినిమా ప్రచారం చేశారు. టిక్కెట్ల అమ్మకాలకు స్కీమ్స్ పెట్టారు. ఆ సినిమాకు జరిగిన ప్రచారం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి కూడా ఓ వైవిధ్యమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తీస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణికి మొదటి నుంచీ ఏదో ఒక రకంగా ప్రచారం లభిస్తూనే ఉంది. ఇప్పుడు  మూడు వాహనాలలో ఆ చిత్రబృందం బయలుదేరింది. చిత్రం విజయం సాధించేందుకు .. .. భారతదేశంలోని వంద పుణ్యక్షేత్రాలలో 100 కిలోల కుంకుమార్చనలతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు చేస్తారట. శాతకర్ణి చిత్రానికి సంబంధించిన చిత్రాలతో ఆ శకటాలను అలంకరించారు.

అభిమానుల కోలాహలం మధ్య శాతకర్ణి 100 పుణ్యక్షేత్రాల యాత్ర ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రచారానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీన్ని చూసి .. .. ఇతర చిత్రాల వారు కూడా ఈ తరహా ప్రచారం మొదలు పెడతారేమో మరి.

 

 

 

Leave a Reply

Your email address will not be published.