సమంత బరువు లెత్తేస్తోంది

ఒకప్పుడు ముట్టుకుంటే కందిపోయేలా ఉండే అమ్మాయిలు ఇప్పుడు భారీ బరువులు ఎత్తుతూ రఫ్ అండ్ టఫ్ గా తయారవుతున్నారు. సినిమా హీరోయిన్ లంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కాని ఫిట్ నెస్ కోసం నేటి అందాల భామలు జిమ్ లలో భారీగా కసరత్తులు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా అందాల భామ సమంత ఇలాంటి ఫీటే ఒకటి చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ మధ్య సినిమాలతో కన్నా తన పెళ్లి వార్తలతోనే ఎక్కువగా సందడిచేస్తున్న సమంత, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‑గా ఉంటోంది. ముఖ్యంగా త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించిన తరువాత ఈ బ్యూటి మరింత జోరు పెంచింది. వరుసగా ట్విట్టర్, ఇన్‑స్టాగ్రామ్‑లలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

సమంత షేర్ చేసిన చిన్న వీడియోలు, ఫోటోస్ ని ఫ్యాన్స్ నోరెళ్లబెట్టి చూసేస్తున్నారు. అలాగని ఈ భామ గ్లామర్ షో ఏం చేయలేదు. షూ.. ట్రాక్ ప్యాంట్.. టీషర్ట్ వేసుకుని.. జస్ట్ జిమ్ లో వర్కవుట్ చేస్తోందంతే. కేవలం వర్కవుట్స్ వీడియోలో కిక్ ఏముంటుంది అనుకోవచ్చు కానీ.. సమంత  బోలెడంత బరువును భుజాలపై మోసేస్తోంది. చిన్నపాటి డంబెల్స్ కాదు.. ఏకంగా వెయిట్ లిఫ్టింగ్ చేసేసింది. మరి అవి ఎంత బరువో తెలుసుకుంటే షాక్ కాకుండా మానరు.

అక్కినేని ఫ్యామిలీ ఇన్సిపిరేషన్ తో హెల్త్‌ పై మరింత శ్రద్ద పెట్టిన సామ్ జిమ్ లోనే ఎక్కువగా గడుపుతోంది. తాజాగా తాను చేసిన వర్కవుట్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకి 72 కేజీలు అనే కామెంట్  రాసిన సమంత.. గాళ్ పవర్ అంటూ ట్యాగులు కూడా పెట్టింది. 72 కేజీలను సమంత అంత సులువుగా ఎత్తేస్తోందంటే.. సామ్‌ చాలా స్ట్రాంగ్ గురూ అనుకోవాల్సిందే. ఇంతలేసి బరువులు మోసేయడం చూసి.. మిగతా హీరోయిన్స్ కూడా ఇలాంటివాటిపైన దృష్టి పెడతారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.