కోలీవుడ్ పై సమంత ఫోకస్

సౌత్ హీరోయిన్స్ ఒకే భాషలో కాకుండా మూడు నాలుగు లాంగ్వేజెస్ లో యాక్ట్ చేస్తుంటారు. ఒక్కో హీరోయిన్ కు ఒక్కో భాషలో ఒక్కో సీజన్ ఉంటుంది.  ఆయా భాషల్లో హిట్స్ కొడుతుంటారు. ఒక లాంగ్వేజ్ లో కొన్ని సక్సెస్ లు వచ్చాక…హీరోయిన్స్ సడెన్ గా వేరే భాషా చిత్రాలకు షిఫ్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు సమంత కూడా ఆ రూట్ లోనే ఉంది.

సక్సెస్ స్టార్ సమంత ఇప్పుడు తమిళ సినిమాలు తప్ప వేరే పిక్చర్స్ ఒప్పుకోవడం లేదు.  సమంత యాక్ట్ చేసిన జనతా గ్యారేజ్ బంపర్ హిట్ అయింది. అయితే ఆ పిక్చర్ తర్వాత

ఈ చెన్నయ్ సుందరి సమంత ఏ టాలీవుడ్ మూవీకి సైన్ చేయలేదు.తమిళంలో మాత్రం వరసగా సినిమాలకు ఓకే చెబుతోంది. ఇప్పటికే శివకార్తికేయన్ హీరోగా రూపొందే ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించింది.

లేటెస్ట్ గా మరో తమిళ చిత్రానికి సంతకం చేసినట్టు తెలిసింది. క్రేజీ హీరో విశాల్ తో పిక్చర్ చేయబోతోంది. విశాల్ తో పిక్చర్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి. మిత్రన్  డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఇరుంబుతిరై’ అనే పేరుతో తీయబోతున్న ఈ చిత్రంలో సమంతను తీసుకున్నారట. హీరోయిన్ సెలెక్షన్ లో విశాల్ కు ఓ రూల్ పెట్టుకున్నాడట.

ఒక సినిమాలో ఒక హీరోయిన్ తో యాక్ట్ చేస్తే మరో సినిమాకు ఆమెను రిపీట్ చేయడు. మరో హీరోయిన్ ను ఎంచుకుంటాడు. ప్రస్తుతం ‘కత్తి సండై’ చిత్రంలో తమన్నాతోను, ‘తప్పరివాలన్’లో రకుల్ ప్రీత్ సింగ్ తోను నటిస్తున్నాడు. సమంతతో ఓ పిక్చర్ లో చేస్తాడు.

Leave a Reply

Your email address will not be published.