రోటీన్ సినిమాలతో సమంత విసుగుచెందిదట..!

సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు. మంచి కథలు, పాత్రలు కూడా. మంచి కథ దొరికితే సినిమా తీయాలని, మంచి కేరక్టర్ వేయాలని కొందరికి నిజంగానే ఉంటుంది. గ్లామర్ పాత్రలు వేసివేసి విసుగుపుట్టిన వాళ్లూ కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లు తన టాలెంట్ చూపించేందుకు గుడ్ కేరక్టర్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. టాప్ గ్లామరస్ హీరోయిన్ సమంత కూడా అదే భావనతో ఉంది.

గ్లామరస్ హీరోయిన్ సమంత నటించిన జనతాగ్యారేజ్ ఇటీవల రిలీజై కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ చిత్రం సక్సెస్ పట్ల సామ్ కూడా హ్యాపీగానే ఉంది. అయితే ఈ సినిమా రావడానికి కొన్ని నెలల ముందే సమంత కొత్త సినిమాలు  సైన్ చేయడం మానేసింది. టాలీవుడ్ కే కాదు, కోలీవుడ్ కి కూడా చేయడం లేదు.

తను ప్రేమించిన నాగచైతన్యను త్వరలో వివాహం చేసుకోబోతోంది కాబట్టి సినిమాలు మానేసిందని అంతా అనుకున్నారు. ఈ కారణంగానే సమంత తను చేస్తున్న పిక్చర్స్ కూడా త్వరగా కంప్లీట్ చేసేసిందని కూడా అంతా భావించారు.

కానీ దీనిపై క్లారిటీ ఇస్తూ సమంత అసలు కారణం చెప్పింది. రొటీన్ రోల్స్ చేసి చేసి విసుగుపుట్టిందట. అందుకే కొత్తగా ఏ సినిమాలనూ ఒప్పుకోలేదట. మూస కేరక్టర్స్ కాక మంచి కేరక్టర్స్ చేయాలని తనకుందని, కానీ అలాంటివి రావడం లేదని, అందుకే కొత్త సినిమాలు సైన్ చేయలేదని సమంత చెప్పింది. సౌత్ హీరోయిన్స్ కు మంచి పాత్రలు చేయాలని ఉన్నా దొరకడం లేదని సామ్ ఫీలైంది. మంచి పాత్ర దొరక్కే సినిమాలు చేయడం లేదని చెప్పడానికి బాధపడుతున్నాను అని సమంత ట్వీట్ చేసింది. హీరోయిన్ ఛాన్స్ రాకపోతే ఐటం చేయడానికైనా రెడీ అయ్యే హీరోయిన్స్ సమంతను చూసి తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.