సమంత హిందువుగా మారిందా?

హైదరాబాద్: క్రైస్తవ మతస్థురాలైన సినీ హీరోయిన్ సమంత హిందువుగా మారిందా? టాలీవుడ్ లో ఈ ప్రశ్న చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు ఫోటోలు ఈ వదంతికి కారణం.

నాగార్జున కొడుకు చైతన్య (చైతు)కూ, సమంతకు పెళ్లి జరగబోతోంది. ఈ ముగ్గురూ  నుదుట కుంకుమ ధరించి ఒక ఫోటోలో కనిపించారు. వారి వెనక కొందరు హిందూ పురోహితులు కూడా ఉన్నారు. చైతు, సమంత ఒక చాప మీద కూర్చుని ఉన్నారు.

తను మొదట చెన్నైలో క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసుకుంటాననీ, తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్ లో తమ పెళ్లి జరుగుతుందని సమంత ఇప్పటికే చెప్పింది.

ఈ పెళ్లి జరగాలంటే సమంత ముందుగా హిందువుగా మారాలని అక్కినేని కుటుంబం మెత్తగానే షరతు పెట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో సమంత, చైతు, నాగార్జునల ట్విట్టర్ లు మాత్రం మూగనోము పట్టాయి.

వేరే కులానికో, మతానికో లేదా రాష్ట్రానికో చెంది అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతున్న రెండో అమ్మాయి ఈ మలయాళీ కుట్టీయే. మొదటి వ్యక్తి అమల అన్న సంగతి తెలిసినదే.

Leave a Reply

Your email address will not be published.