పెళ్లి రిసెప్షన్ ఎక్కడో చెప్పిన సమంత

గత కొద్దిరోజలుగా ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. తన డ్రెస్సింగ్ తోనో.. తన లవ్ ఎఫైర్ తోనో.. సినిమాలతోనో  తరచు ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఎక్కడికైనా వెళితే.. ప్రశ్నలతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే మీడియా ప్రతినిధులకే తన మాటలతో అప్పుడప్పుడు సమంత షాకిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన రిసెప్షన్ ఎక్కడ ఉంటుందో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇటీవలి కాలంలో కొందరు యంగ్ హీరో, హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బిజినెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రకుల్, రెజీనా తదిదరులు వివిధ రంగాలలో బిజినెస్ చేస్తున్నారు. తాజాగా లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనతో కలిసి టీ- గ్రిల్ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు ఈ కార్యక్రమానికి సమంతని గెస్ట్‌ గా ఆహ్వనించాడు.

మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ని లాంచ్ చేసిన సమంత ఇది భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని తెలిపింది. అంతేకాదు, తనకు తెలంగాణ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. తనకు వంట రాదని.. కానీ చేసిన వంట టేస్ట్ చూసి చెప్పటంలో తనే సూపర్ అంది. ఇలాంటి ముద్దు ముద్దు మాటలు సమంత నోటి నుండి వస్తుంటే అంతా ఎంజాయ్ చేశారు.

ఇక లాంచింగ్‌ తర్వాత సామ్‌ని మీడియా ప్రతినిదులు ప్రశ్నలు వేశారు.  వాటికి చక్కని సమాదానాలు ఇచ్చింది. ఆ తర్వాత  పెళ్లి గురించి అడుగుతారని అనుకున్నానే ఇంకా అడగలేదేంటి అంటూ స్వీట్ కౌంటర్ వేసింది. అయితే త్వరలోనే తన పెళ్లి గురించి అందరికి చెబుతానంది. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడా అన్న విషయాన్ని చెప్పని సమంత.. తన రిసెప్షన్ మాత్రం టీ గ్రిల్‌ రెస్టారెంట్ లోనే పెడతానని చెప్పేసింది. మొత్తానికి పెళ్లి వెన్యూ డిసైడ్ కాకున్నా.. సమంత రిసెప్షన్ వెన్యూ మాత్రం డిసైడ్ అయినట్లేనన్న మాట. 

Leave a Reply

Your email address will not be published.