మహేష్ ను మించిపోయిన సమంత     

సినిమాల్లో హీరోలదే డామినేషన్. మన దేశంలో అన్ని ఉడ్ లలోనూ ఆధిపత్యం వాళ్లదే. కేవలం లేడీస్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని అకేషన్స్ లో హీరోయిన్స్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ ఈ విషయంలో ఏకంగా ఓ సూపర్ స్టార్ నే బీట్ చేసేసిందట.

బాలీవుడ్ లో సన్నీలియోన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఐశ్వర్యా రాయ్ ఫాలోవర్స్ కు లిమిటే లేదు. మన టాలీవుడ్ హీరోయిన్స్ కు కూడా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. లేటెస్ట్ లెక్కల ప్రకారం హీరోయిన్ సమంత .. .. సోషల్ మీడియాలో ఫాలోయర్స్ విషయంలో  టాప్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబును మించిపోయిందట. 

సోషల్ మీడియా నెట్ వర్క్ లో సమంతకున్న ఫాలోయర్స్ ను చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారట. సోషల్ మీడియాలో ఇంతవరకు 25 లక్షల మంది అభిమానులతో  ప్రిన్స్ మహేష్ బాబు టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే .. లేటెస్ట్ లెక్కల ప్రకారం సమంతకు 30 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నట్టు తెలిసింది. సమంతకు ఇంతమంది ఫ్యాన్స్ ఎలా అయ్యారా? అనే ఆరాలూ మొదలయ్యాయి.

సమంత ట్విటర్ ను ఎక్కువగా వాడుతుంటుంది. దాదాపు రోజూ ఏదో ఒక అంశాన్ని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. వారి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. మరి మహేష్‌ బాబు  ట్విటర్ ద్వారా ఒపీనియన్స్ వెల్లడించడం తక్కువే నంటారు. అయితే మహేష్ బాబు సైట్ ను చూసేవారు కూడా లక్షలాది మంది ఉన్నారు. అది ప్రిన్స్ కు అడ్వాంటేజ్ అయింది. అయితే  నెట్ లో సమంత పాపులారిటీ పెరగడానికి మరో కారణం,  నాగచైతన్యతో  లవ్ ఎఫైర్ అనే టాక్ ఉంది.

సోషల్ మీడియాలో సినిమాలకన్నా పర్సనల్ మేటర్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బాలీవుడ్  సెలెబ్రిటీస్ కు ఈ కిటుకు తెలుసు. ట్విటర్ లో, ఫేస్ బుక్ లో బాలీవుడ్ స్టార్స్ వ్యక్తిగత విషయాలే ఎక్కువ. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా ఆ రూట్ లో వెడుతున్నారేమో అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.