సోషల్ మీడియాలో మహా చురుకు    

మెగా హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్ . తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా ఎంతో క్రేజ్ పొందిన హీరోయిన్‌ సమంత. ఈ ఇద్దరు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ లో ఫుల్‌ క్రేజ్ సంపాదించిన సమంత, అల్లు అర్జున్ లు కొన్నాళ్ళుగా సోషల్‌ సైట్స్ ద్వారా అభిమానులకు చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సామ్‌ జంట తాజాగా ఓ ఫీట్‌ని సాధించింది.

ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోలు మాత్రమే సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉండేవారు. కాని ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‑గా మారుతున్నారు. తమ సినిమా ప్రచారాలతో పాటు.. తమ ఆలోచనలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు సోషల్ మీడియానే వేదికగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరుతున్నారు. ఈ రేసులో హీరోయిన్ సమంత, హీరో అల్లు అర్జున్‑లు అరుదైన ఘనత సాధించారు.

జనతా గ్యారేజ్ తర్వాత తెలుగులో ఏ ఒక్క సినిమాను ఒప్పుకొని సమంత ప్రస్తుతం పెళ్లి పనులతో కాస్త బిజీగా  ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‑గా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా నాగచైతన్యతో తన రిలేషన్ షిప్‑కు సంబందించిన అప్‑డేట్స్‑ను ఎప్పటికప్పుడు అభిమానుల ముందుంచుతూ ఆకట్టుకుంటోంది. అందుకే స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చే స్థాయిలో ఏకంగా 30 లక్షల మంది ఫాలోవర్స్‑ను సొంతం చేసుకుంది సామ్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ఫాలోవర్స్ లిస్ట్‑లో దూసుకుపోతున్నాడు.ఎప్పటికప్పుడు డ్రెసింగ్, డాన్సులు, లుక్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ కొత్త కొత్త స్టైల్స్ ఫాలో అయ్యే బన్నీ యూత్ కి ఒక ఫ్యాషన్ ఐకాన్. బన్నీకి తెలుగులోనే గాక కర్ణాటక, కేరళ, తమిళనాడులో సైతం మరే తెలుగు హీరోకి లేని క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ మెగా హీరో తాజాగా  10 లక్షల మంది ఫాలోవర్స్‑ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్స్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.