సల్మాన్ ఖాన్ ఔదార్యం

టాలీవుడ్ ఎవ్వరినైనా ఆదరిస్తుంది. ఇక్కడి వారి టాలెంట్ నైనా పెద్దగా పట్టించుకుంటారో లేదోకాని బయట వారి టాలెంట్ ని మాత్రం ఇట్టే అభినందించేస్తారు. కొంతమంది స్టార్స్ అయితే భుజాల మీదకు ఎత్తుకునిమరీ తిప్పుతారు, అది మన ఔదార్యం. ఆ ఔదార్యం ఎంత వరకు వెళ్లిందంటే దేశ ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయనంత వరకు ప్రయాణించింది. అందుకు నిదర్శనం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు.

పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్దవాతావరణం అలుముకున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా మన వారు పాక్ ను మట్టికరిపించాలనే భావనతో వున్నారు. ఇప్పటికే చాలా ఎక్కువ సహనాన్ని చూపించారు ఇక ఉపేక్షించకుండా పాకిస్థాన్ పై యుద్దం ప్రకటించాలని దేశంలో ని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భారతీయులకు పాకిస్థానీల పై కొంత ద్వేష భావం ఏర్పడటం సహజం. అందుకే పాకిస్థానీ నటులను బాలీవుడ్ నుండి పంపివేయండంటూ నినదిస్తున్నారు.

బాలీవుడ్ మాత్రం మన వారి భావోద్వేగాలను అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరని తెలుస్తుంది. పాకిస్థాన్ లో మన దేశానికి సంబంధించిన సినిమాలు బ్యాన్ చేసినప్పటికీ మన వారు మాత్రం అక్కడినుండి దిగుమతి చేసుకున్న నటీనటులను సినిమాల్లో కి తీసుకోవడం ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. శివసేన వంటి సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరించినా వారి మాటలను బాలీవుడ్ బడా బాబులు ఖాతరు చేయడంలేదు.

ఇటీవల సల్మాన్ ఖాన్ కూడా పాకిస్థానీ నటులు ఉగ్రవాదులేమీ కాదని వారిని సినిమాల్లోకి తీసుకోవడంలో ఎటువంటి తప్పులేదని చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్థానీ నటులు ఉగ్రవాదులు కాకపోవచ్చుకానీ దేశంలోని ఎక్కువ మంది అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని బాలీవుడ్ గుర్తించాలని విశ్లేషకులు అంటున్నారు. మన దగ్గర ఎంతో మంది నైపుణ్యత కలిగిన వ్యక్తులు వున్నారు. వారిని ప్రోత్సహించడం మానేసి పాకిస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న నటీనటులను ప్రోత్సహించడంలో అర్ధమేంటనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి.

బార్డర్ లో ఇండియా పాకిస్థాన్ యుద్ద వాతావరణం ఏర్పడి వుండగా, బాలీవుడ్ లో కూడా అక్కడ నటీనటులకు సినిమా అభిమానులకు మధ్య కోల్డ్ వార్ రన్ అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ మన మనోభావాలను గౌరవిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.