టాప్ ట్యాక్స్ పేయర్ సల్మాన్

కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే సినిమా యాక్టర్లు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను కూడా కోట్లలోనే ఉంటుంది. ఎంత ఆదాయం ఉన్నా పన్ను చెల్లించేవారు తక్కువే. చాలామంది ఎగ్గొడుతుంటారు. అలా ఎగ్గొట్టేవారి గురించి చాలాసార్లు చదువుతుంటాం. అయితే గడువుకంటే ముందే అడ్వాన్స్ గా ఇన్ కం టాక్స్ చెల్లించేవారూ ఉన్నారు. ఈసారి టాక్స్ పేయర్స్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు.

సినిమారంగంలో పన్ను బకాయిలు చెల్లించనివాళ్లు కొందరుంటారు. ఎంతగా సంపాదిస్తున్నా  టాక్స్ పే చేయడానికి మనసొప్పదు. ఈ పరిస్థితిలో బాలీవుడ్ లో టాప్ స్టార్ట్ కొందరు అడ్వాన్స్ టాక్స్ …. అంటే ముందే పన్ను చెల్లించి సూపర్ గా నిలిచారు. ఆ కోవలో ముందున్నాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్  ఈ ఏడాది హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ సుల్తాన్ 16 కోట్ల రూపాయల అడ్వాన్స్ టాక్స్ కట్టాడు.

టాక్స్ కట్టిన వాళ్ల లిస్ట్ లో సల్మాన్  ఫస్ట్ ప్లేస్ సంపాదించాడు.  గత ఏడాది 18 కోట్లు ఆదాయం పన్ను చెల్లించి  నెంబర్ వన్ గా నిలిచాడు అక్షయ్ కుమార్. ఈసారి అక్కీ కేవలం 11 కోట్లు మాత్రమే కట్టి రెండో స్థానంలో  ఉన్నాడు. ఇక మరో విచిత్రమేంటంటే… ఈ ఏడాది ఒక్క హిట్ మూవీ లేకున్నా హీరో రణబీర్ కపూర్ కూడా టాక్స్ ఎక్కువే కట్టాడు. 7.8 కోట్లు పన్ను కట్టాడు. పన్ను చెల్లింపుదారుల్లో ఇతను మూడో ప్లేస్ లో ఉన్నాడు.

టాక్స పేయర్స్ లిస్ట్ లో సల్మాన్, అక్షయ్, రణబీర్ మొదటి మూడు పొజిషన్స్ లో ఉండగా ఆ తర్వాతి ప్లేసెస్ లో కపిల్ శర్మ, అమీర్ ఖాన్ ఉన్నారు. బాలీవుడ్ లవర్ బాయ్ హృతిక్ రోషన్ టాప్ టెన్ లో  కూడా లేడు. బాలీవుడ్ టాప్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ఆదాయపు పన్ను  ఎంత కట్టారో ఇంకా వెల్లడి కాలేదు.

Leave a Reply

Your email address will not be published.