‘ఇజం’ రీమేక్ ఆలోచనలో సల్మాన్

బాలీవుడ్ లో ఇప్పుడు హీరోలే ఎక్కువ సినిమాల్ని టేకప్ చేస్తున్నారు. విశేషమేమంటే డైరెక్ట్ పిక్చర్స్, రీమేక్స్, బయోపిక్స్ అనే తేడా లేకుండా ఏది పడితే అది తీసేస్తున్నారు. కొందరు హీరోలు ఓ వైపు స్ట్రయిట్ పిక్చర్స్ చేస్తూనే రీమేక్ లపై కూడా కన్నేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన టాలీవుడ్ పిక్చర్ ను నల్మాన్ ఖాన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఏది టేకప్ చేసినా  గోల్డ్ గా మారిపోతోంది. అతనికి మాంఛి సీజన్  నడుస్తోంది. డైరెక్ట్ పిక్చర్స్ తో హిట్ కొడుతున్న ఈ సుల్తాన్ రీమేక్స్ పై కూడా ఓ లుక్ వేస్తున్నాడు. వెరీ రీసెంట్ గా రిలీజైన పూరీ జగన్నాథ్ మూవీ ఇజం ను రీమేక్ చేయాలనుకుంటున్నాడట.

పూరీ జగన్నాథ్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇజం మూవీకి స్టార్టింగ్ లో అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చినా  ఆ తర్వాత  పికప్ అయింది. ఆడియన్స్  బాగా రిసీవ్ చేసుకున్నారు. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా ఏదో కమర్షియల్ ఫార్ములా సినిమా కాదు.. సామాజిక సందేశమూ ఉంది.

అవినీతిని ఎదిరించాలనే మెసేజ్ ఉన్న ఇజం మూవీని బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ ఇటీవలే చూశాడట.  సల్మాన్ కు ఈ సినిమా నచ్చింది.  దాంతో హిందీలో  రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చింది. సల్లూ భాయ్ ఇలా ఆలోచిస్తున్న  టైంలోనే  ఇజం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా  ముంబయిలో ఉన్నాడట. సల్మాన్ ని కలిసి రీమేక్ గురించి మాట్లాడవచ్చని అంటున్నారు.

పూరీ జగన్నాథ్ సినిమా హిందీలో రీమేక్ కావడం ఇది కొత్త కాదు. అదివరకు పోకిరి ని కూడా వాంటెడ్  పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు ఇజం కూడా  రీమేక్ రూట్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published.