రెండో పెళ్లికి రెడీ

ఒకప్పుడు బాలీవుడ్ లో ఆ హీరోయిన్ కుర్రకారును ఉర్రూతలూగించింది, తన అందాలతో యువకుల హృదయాలు లావాలా ఉప్పొంగేలా చేసింది. ఎంతోమంది కలల రాణిగా విహరించిన ఆ హీరోయిన్ మరోసారి పెళ్లి చేసుకోవాలని తన మనసులో మాట చెప్పింది. మరి తన మనుసులోని మాటను అంత బాహాటంగా చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుందా అయితే ఈస్టోరీ ని చదవండి.

ఒకప్పుడు మనీషా కోయిరాల పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండె వేగం ఎక్కువైయ్యేది. తన అందానికి యువత  ఫిదా అయ్యారు. అందం, నటన సమపాళ్ళలో గుప్పించిన హీరోయిన్ మనీషా కోయిరాలా. బొంబాయి, భారతీయుడు, బాబా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. తరువాత కాన్సర్ వ్యాధి రావడంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది.

సినిమాలు చేస్తుండగానే నేపాలి వ్యాపారవేత్తను మనీషాకోయిరాలా వివాహం చేసుకుంది. పెళ్లి అయిన రెండేళ్ళకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మనీషా కాన్సర్ వ్యాధి భారినపడటంతో విదేశాల్లో చికిత్స తీసుకుంది. క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైన తరువాత ఇండియాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు మనీషా పూర్తి ఆరోగ్యంతో వున్నా తన జీవితం మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది.

మనీషా కుటుంబం నేపాల్ లో వుంటుంది. మనీషా మాత్రం సినిమాల కోసం ప్రయత్నిస్తూ ముంబైలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం మనీషా కోయిరాలా భర్తకు విడాకులిచ్చి వుండటంతో ఒంటరి తనాన్ని ఫీల్ అవుతుందట. త్వరలోనే ఒ పాపను దత్తత తీసుకోవాలని అలోచనలో వుందని తెలిపింది. ఒక పాపను దత్తత తీసుకున్న తరువాత జీవిత భాగస్వామిని కూడా చూసుకోబోతున్నట్టు మనీషా కోయిరాల తన అంతరంగాన్ని తెలిపింది.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.