రానాకి ముందే తెలుసట

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన చైతూ, సమంతల పెళ్లి విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు నాగచైతన్య. ఇప్పటికే తను పెళ్లి చేసుకోబోయేది సమంతనే అంటూ ప్రకటించేసిన ఈ యంగ్ హీరో ఈ విషయం తన తల్లి దండ్రుల కన్నా ముందే మరొకరికి తెలుసని చెప్పాడు. ఈ విషయం అటు ఇండస్ట్రీనే కాక ఇటు అభిమానులని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

కొన్నాళ్ళుగా అభిమానులని ఊరిస్తూ వస్తోన్న చైతూ, సమంతల పెళ్లిపై తాజాగా పూర్తి క్లారిటీ వచ్చింది. ఇక ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా తమ ప్రేమకు సంబంధించిన ఒక్కో విషయాన్ని రివీల్‌ చేస్తూ  వస్తున్నారు. అయితే సమంతతో చైతూ ప్రేమాయణం గురించి నాగార్జునకు తెలియడానికి ముందే తన కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉన్న రానాకి తెలిసిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చైతూనే స్వయంగా వెల్లడించాడు.

నాగచైతన్య వెనుక అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు.. రామానాయుడు కుటుంబం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతను రామానాయుడికి కూడా మనవడే. చైతూ బాల్యం చాలా వరకు దగ్గుబాటి ఫ్యామిలీలోనే సాగింది. చైతూ మావయ్య సురేష్ కొడుకైన రానాతో అతడికి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి పెరిగారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.  తన ఇష్టాయిష్టాలను ముందు రానాతోనే షేర్ చేసుకునే వాడట.

తమ లవ్ స్టోరీ గురించి రానాకు ముందే తెలుసని,  తను,  సమంత క్లోజ్ అన్న విషయం రానాకి ముందే అర్థమైందని చైతూ చెప్పాడు. ఐతే ఈ విషయాన్ని ఫ్యామిలీలో రానా చెబితే బాగుండదని తనే చెప్పినట్టు చైతూ వెల్లడించాడు.  తనకు 30 ఏళ్ల వయసు వచ్చాక జీవితం గురించి ఆలోచించినట్టు ఈ కుర్రాడు తెలిపాడు. సినిమాలు చేస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే అని భావించి పెళ్లి ఆలోచన చేసినట్లు చెప్పాడు.

తనకు సమంత తప్ప వేరే అమ్మాయే ఊహాలోకి రాలేదని,  తన జీవిత భాగస్వామి తనే అని తనకు తాను కన్ఫర్మ్ చేసుకున్నాకే  సమంత దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్లు చైతూ తెలిపాడు. మొత్తానికి ఈ జంట త్వరలోనే పెళ్ళిపీటలెక్కనుండగా అభిమానుల ఆనందం అవధులు దాటుతోంది.

Leave a Reply

Your email address will not be published.