స్నేహం బంధుత్వం అవుతుందా?

రాంచరణ్, శర్వానంద్ లు చాలా క్లోజ్ ఫ్రండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. చదువుకునే రోజులనుండి ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం వుంది. అయితే ఈ స్నేహం కాస్తా బంధుత్వంగా మారనుంది. అవును ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

స్నేహుతులు కాస్తా బంధువులుగా మారిన సందర్భాలు చాలా వున్నాయి. అప్పటివరకు ఫ్రెండ్స్ గా వుండి తరువాత పెళ్ళిళ్ళతో బంధువులు అవుతుంటారు. అలాంటిదే టాలీవుడ్ లోనూ జరగబోతోందని అంటున్నారు. రాంచరణ్‌, శర్వానంద్ లు ఇద్దరు తోడల్లుళ్ళు అవబోతున్నారని సమాచారం.

చరణ్ వైఫ్ ఉపాసన కజిన్ చెల్లెల్ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అంతట హాట్ చర్చ నడుస్తోంది.

 ఇప్పటికే శర్వానంద్ ఉపాసన కజిన్ ఫ్యామిలీలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. రేపోమాపో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందట.

Leave a Reply

Your email address will not be published.