చెర్రీకి మిలియన్ డాలర్ పరీక్ష

యంగ్ హీరో నాని గత ఏడాదే ‘భలే భలే మగాడివోయ్’తో యుఎస్ లో మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది వచ్చిన నాని మూడు సినిమాలూ ఈజీగా హాఫ్ మిలియన్ మార్కును దాటేశాయి. మిలియన్ క్లబ్బుకి చేరువగా కూడా వచ్చాయి. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో కూడా ‘పెళ్లిచూపులు’ సినిమాతో మిలియన్ క్లబ్బును అందుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి చూపులు మెగా హీరో పై పడ్డాయి. తన లేటెస్ట్‌ సినిమాతో ఆ మార్కు అందుకుంటాడా అనే దానిపై చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలు తెలుగు రాష్ట్రాలలోనే కాక యూఎస్ లోను తమ సత్తా చూపాలనే కసితో ఉన్నారు. యంగ్‌ హీరోలు కొందరు ఇప్పటికే తమ జోరు చూపించారు .  కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మాత్రం ఇప్పటిదాకా యుఎస్ లో మిలియన్ డాలర్ మూవీ లేదు. గత ఏడాది ‘బ్రూస్ లీ’తో మిలియన్ క్లబ్బేంటి.. ఏకంగా 2 మిలియన్ క్లబ్బే టచ్ చేసేస్తాడంటూ గట్టిగా ప్రచారం చేశారు. ఈ చిత్రాన్ని 200కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారక్కడ. చిరంజీవి గెస్ట్ రోల్ కూడా చేయడంతో ఈ సినిమాకు తిరుగుండదని అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా చరణ్ కు నిరాశనే మిగిల్చింది.

చరణ్‌ ప్రస్తుతం ధృవ అనే చిత్రం చేస్తోండగా ఈ చిత్రానికి యుఎస్ లో ఎలాంటి ఫలితం వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్టుగా రిలీజైన నిఖిల్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ యుఎస్ లో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ చరణ్ కు సవాలు విసురుతోంది. ఫస్ట్ వీకెండ్లోనే 4 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో మిలియన్ క్లబ్బును టచ్ చేసినా ఆశ్చర్యమేమీ లేదు.

ఒక వేళ ఫుల్ రన్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం  మిలియన్ కబ్బులోకి అడుగుపెడితే , ధృవకి ఈ రికార్డ్‌ సాధించడం మరింత ప్రతష్టాత్మకంగా మారుతుంది . ఐతే ఇంతకుముందు చరణ్ చేసినవన్నీ రొటీన్ మాస్ మసాలా సినిమాలు. ‘ధృవ’ మాత్రం యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లు కొంచెం క్లాస్ లక్షణాలున్న మూవీ. కాబట్టి మంచి టాక్ వస్తే ఈ సినిమా చరణ్ ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీగా నిలిచే అవకాశాలున్నాయి. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.