స్పీడ్ పెంచిన రాంచరణ్

మన హీరోలు సినిమాలు చేయడంలో ఒక్కోసారి నిదానంగా ఉంటారు. మరోసారి దూకుడుగా ఉంటారు. ఆ దూకుడుకి హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం ఉండదు. దాదాపు ఏడాది రెండేళ్ల కిందటివరకు టాలీవుడ్ సీనియర్ హీరోలు కానీ, యంగ్ హీరోలు కానీ వరస సినిమాలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆ రెండు రకాల హీరోలు కూడా మూవీల నంబర్ పెంచారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడూ అంతే.

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాంచరణ్ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఒక వంక తను చేసే సినిమాలు, మరోవంక డాడీ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150కు నిర్మాతగా ఎన్నో వ్యవహారాలు చూసుకొంటూ బిజీగా ఉన్నాడు. ఖైదీ నంబర్ 150 తీస్తూనే తన ధృవ సినిమాను కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఒకే టైంలో ప్రొడ్యూసర్ గా, హీరోగా వ్యవహరించాడు.

ధృవ మూవీ చేస్తూనే.. చెర్రీ మూడు సినిమాలకు కమిటయ్యాడు. ఇందులో ఒకటి సుకుమార్ మూవీ ఒకటి. సుకుమార్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. తక్కువ టైంలోనే హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సో .. ..అతనితో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ పిక్చర్ జనవరి ఎండింగ్ లో షూటింగ్ కు వెడుతుందని అంటున్నారు.

సుకుమార్ సినిమాకు కమిటైన రాంచరణ్ మరోవంక … మణిరత్నంతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ ఈ సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ రెండు పిక్చర్స్ కాక మరోటి కూడా చెర్రీ చేయబోతున్నాడు. అది కొరటాల శివ మూవీ. ఇటీవల హిట్ పెరేడ్ చేస్తున్న కొరటాలతో మూవీకి రాంచరణ్ ఇంట్రెస్టింగ్ ఉన్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ కు కొంత టైం పట్టొచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.