కోర్టు కెక్కిన రంభ

చాలా మంది సినిమా వాళ్ళ వైవాహిక జీవితాలు వివాదాల్లోనే వుంటాయి. అయితే వీరంతా చాలా కాలం కాపురం చేసిన తరువాత గొడవలు పడి విడిపోతుండటం చేస్తుంటారు. ఎవరిదగ్గర లోపముంటుందో తెలియదు కాని కోర్టు మెట్లు ఎక్కేవరకు వీరి వివాదాలు వెళుతున్నాయి. రీసెంట్ గా మాజీ హీరోయిన్ రంభ కూడా భార్యభర్తల వివాదంతో కోర్టు మెట్లు ఎక్కిందట.

తెలుగు, తమిళ పరిశ్రమలలో ఒక ఊపు ఊపిన హీరోయిన్ రంభ. రంభ అంటే కుర్రాళ్ళు హృదయాలు ఉప్పొంగి పోయేవి. పెద్ద పెద్ద హీరోలతో నటించిన రంభ వివాహం తరువాత సినిమాలకు దూరం అయింది. చాలా కాలం కుటుంబ జీవితానికే పరిమితమైన రంభ రీసెంట్ గా కుటుంబ తగాదాతో వార్తలకు ఎక్కింది.

రంభ కొన్ని నెలలుగా భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడిపోవాలని ఫ్యామిలి కోర్టును ఆశ్రయించారట. అయితే రంభ మాత్రం భర్తతో కలిసి జీవితాన్ని మళ్ళీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును కోరింది.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు భర్తతో కలిసి వుండే  హక్కులు కల్పించాలని ఆమె కోరింది. రంభ, ఇంద్రన్ పద్మనాథన్లకు ఇద్దరు సంతానం. 2010 ఏప్రిల్లో రంభ కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఏవో సమస్యలు తలెత్తడంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. రంభ పిటిషన్ పై డిసెంబరు 3 న విచారణ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published.