రామ్ లవ్ ‘లవ్ మూవీస్’

యంగ్ హీరో ఎవరైనా లవ్ స్టోరీస్ చేయడానికి ఇష్టపడడం సహజం. ప్రేమకథ చేస్తే యూత్ కి బాగా పడుతుంది. పైగా సరదాగా ఉంటుంది కాబట్టి లేడీస్ కి కూడా నచ్చుతుంది. కొన్ని సినిమాల తర్వాత యంగ్ హీరోస్ యాక్షన్ వైపు చూపు సారిస్తారు. అయితే యాక్షన్ పిక్చర్ చేయడం అంత ఈజీ కాదు…అందుకే ఓ యంగ్ హీరో యాక్షన్ మూవీస్ జోలికి పోకుండా లవ్ మూవీస్ చేద్దామనుకుంటున్నాడట.

లవ్ పిక్చర్స్ స్మూత్ గా హాయిగా ఉంటాయి కాబట్టి అందరూ చూస్తారు. పేచీ ఉండదు. కొందరు యాక్షన్ సినిమాలూ చేస్తుంటారు.ఒకటి రెండు సినిమాలు చేసినా అవి సరిగా లేకపోతే యాక్షన్ హీరో ఇమేజ్ రాదు.అందుకే హీరో రామ్ లవ్ సబ్జెక్ట్స్ పైనే ఫోకస్ చేస్తున్నాడట. రామ్ మూవీని సరదాగా చూడొచ్చు అనే పేరుంది.

రామ్ పిక్చర్ ని ఎంజాయ్ చేయొచ్చు అంటారు. మూవీ స్టోరీ ఎలాంటిదైనా తనదైన స్టైల్ తో మెస్మరైజ్ చేస్తాడని అంటారు. అందుకే కుర్రాళ్లు రామ్ పిక్చర్ ని లైక్ చేస్తున్నారు. రామ్ చేసిన ‘నేను శైలజ’ లవ్ సబ్జెక్టే అయినా వెరైటీగా ఉంది. అయితే ఇతని సినిమాలు కాస్త రొటీన్ గా ఉన్నాయనే ఒపీనియన్ కూడా ఉంది. ‘హైపర్’ విషయంలో ఇలాంటి విమర్శ వచ్చింది.

తను లవ్ సబ్జెక్ట్ చేస్తేనే సక్సెస్ వస్తుందని రామ్ నమ్మకం. అందుకే అలాంటివే చేయాలనుకుంటున్నాడు. అందుకే… అనిల్ రావిపూడితో చేద్దామనుకున్న మూవీ కాకుండా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ తర్వాత కూడా అలాంటివే చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.