లవ్ స్టోరీ చేస్తున్న చెర్రీ

ఈమధ్య మన స్టార్ హీరోలు … ముఖ్యంగా స్టార్ డమ్ ఉన్న కుర్ర హీరోలు లవ్ సబ్జెక్ట్ లు చేయడం తక్కువై పోయింది. తాము చేసే సినిమాల్లో స్పీడ్, యాక్షన్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సున్నితంగా ఉండే ప్రేమ కథలు చేయడంలేదు. ఈ సిట్యుయేషన్ లో మెగా ఫ్యామిలీ హీరో ఒక లవ్ సబ్జెక్ట్ చేయబోతున్నాడట.  హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసేశారట.

హీరోల కెరీర్ ఎలా సాగుతుందంటే .. . ఫీల్డ్ కి వచ్చిన కొత్తల్లో ప్రేమకథా చిత్రాల్లో చేస్తారు. తర్వాత సెంటిమెంట్ .. .. ఆ తర్వాత యాక్షన్ సినిమాలవైపు మళ్లుతారు. కొంతకాలం తర్వాత మళ్లీ లవ్ సబ్జెక్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు రాంచరణ్ కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాడు. చెర్రీ, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ మూవీ త్వరలో స్టార్ట్ కాబోతోంది. తొంభైల నాటి ఒక విలేజ్ లవ్ స్టోరీతో ఈ మూవీని తీయబోతున్నారు.

చాలాకాలం తర్వాత రాంచరణ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో  ‘ఆరెంజ్’ మూవీ తరువాత చెర్రీ చేస్తున్న లవ్ స్టోరీ ఇదే. ఆ సినిమా లవ్ స్టోరీనే అయినా టైటిల్ చూస్తే యాక్షన్ మూవీలా అనిపించింది. అందుకేనేమో అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో చేయబోయే మూవీకోసం  రాంచరణ్ రొమాంటిక్ గా తయారవుతున్నాడట.

చెర్రీ చేయబోయే మూవీలో అతనికి జోడీగా రాశిఖన్నాని తీసుకున్నారని తెలుస్తోంది.  రాంచరణ్ తో చేయడమంటే  రాశిఖన్నాకు  ప్రమోషన్ వచ్చినట్టే నంటున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఛాన్సును ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. మరి ఈ మూవీలో రాశిఖన్నా సోలో హీరోయిన్ గా చేస్తుందా లేక మరో హీరోయిన్ ఉంటుందా అన్నది సస్పెన్స్.

Leave a Reply

Your email address will not be published.