మురుగదాస్ అంటే అంతిష్టం!

తమ ఫేవరేట్ హీరోతో యాక్ట్ చేయాలని హీరోయిన్స్ కానీ, కొత్తగా వచ్చే అమ్మాయిలు కానీ ఆశ పడతారు. అయితే కొందరు హీరోయిన్స్ కు ఫేవరేట్ హీరోతో యాక్ట్ చేయడం అనేది పక్కన పెట్టి, తను ఇష్టపడుతున్న డైరెక్టర్ సినిమాలో చేయాలనే కోరిక ఉంటుంది. ఓ హీరోయిన్ కు అలాంటి కోరిక ఇప్పుడు తీరింది.

హీరోయిన్స్ ఎంత కమర్షియల్ సినిమాల్లో నటించినా .. .. మంచి రోల్ కోసం, మంచి మూవీకోసం కూడా ఎదురు చూస్తుంటారు. మంచి డైరెక్టర్ చేసే పిక్చర్ లో చేస్తే నటిగా పేరొస్తుందనుకుంటారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా అలాంటి ఆశే ఉంది. ఆమె ఫేవరేట్ డైరెక్టర్ మురుగదాస్.

ఇప్పుడు మురుగదాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే … రకుల్ మురుగదాస్ పిక్చర్ లో ఎప్పుడో నటించాల్సి ఉంది కానీ .. ఆ అవకాశం తప్పిపోయింది. లోగడ  తను నటించిన ఓ యాడ్ ఫిలిం చూసిన ఆ తమిళ డైరెక్టర్ తను అప్పుడు తీస్తున్న  తుపాకి సినిమాలో యాక్ట్ చేయమని అడిగాడట.

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడనే సంగతి రకుల్ పట్ల జరిగింది. అప్పట్లో మోడలింగ్ చేసే రకుల్ సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. మరో విషయం ఏంటంటే, మురుగదాస్ సినిమాల్లో నటించాలన్న కోరిక రకుల్ కి ఎప్పటి నుంచో ఉండేదట.  ఓసారి ‘హాయ్ సార్..అయాం రకుల్ .. మోడల్.. వాంట్ టు మీట్ యూ ..’ అంటూ మెసేజ్ పంపిందట.

ఆ మెసేజ్ ఇప్పటికీ తన మొబైల్ ఫోన్ లో ఉండడంతో,దాన్ని ఈమధ్య రకుల్ .. ..మురుగదాస్ కు చూపిస్తే ఆయన పెద్దగా నవ్వేశారట. అలాగే ఆమధ్య తన సినిమా రిలీజ్ సమయంలో బెస్ట్ విషెస్ చెబుతూ మురుగదాస్ పంపిన మెసేజ్ కూడా ఆయనకి చూపించి థ్రిల్ చేసిందట. మురుగదాస్ అంటే రకుల్ కు ఎంత అభిమానమో దీన్నిబట్టి తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.