థ్యాంక్స్ సిద్ధార్థ్!

దర్శకధీరుడు రాజమౌళి రేంజి మారి పోయింది. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ ఆరాధ్యుడిగా మారిపోయాడు. బాహుబలి మూవీలో ఒకఫ్రేమ్ లో అయినా కనిపించే అవకాశం ఇమ్మని మహామహులనుంచి కూడా రిక్వెస్టులు అందుకుంటున్న జక్కన్న  ఓ బాలీవుడ్ హీరోకు థాంక్స్ చెప్పాల్సి వచ్చింది.

రాజమౌళి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించాడు. ఇటీవల ‘బాహుబలి 2’ కి సంబంధించిన ఫస్ట్‌లుక్ కోసం ముంబైకి వెళ్లిన జక్కన్న అక్కడ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫస్ట్‌లుక్, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ రాజమౌళి టీమ్ ఇప్పుడు ముంబైలో ఉంది. ఈ సందర్భంగానే రాజమౌళి ప్రముఖ బాలీవుడ్ హీరోను కలిశారట.  ఆ తర్వాత ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాడు.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే, సిద్ధార్థ్ మల్హోత్రా. రాజమౌళి ఆయనకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే ఇది సినిమాల విషయంలో కాదు, కూతురు కోరికను తీర్చడంకోసం సిద్ధార్థ్ ను ఓ రిక్వెస్ట్ చేయాల్సివచ్చింది. సిద్ధార్ధ మల్హోత్రాకు రాజమౌళి కూతురు పెద్దఫ్యాన్. అతన్ని కలవాలనే కోరికను జక్కన్నకు చెప్పగా, ఆయనను కలసుకోడానికి రాజమౌళి రిక్వెస్ట్ చేశాడు.

రాజమౌళి అంతటి దర్శకుడు అంత చిన్నకోరిక కోరినప్పుడు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కాదనడం సాధ్యమవుతుందా? అడిగిన వెంటనే సరే అనేసాడు సిద్ధార్థ్.  రాజమౌళి కూతురితో కాసేపు కబుర్లు చెప్పాడు. అందుకు తన కూతురు ఎంతో ఎక్సైట్ అయిందని అంటూ, సిద్ధార్ధ ఇచ్చిన సలహాలకు కూడా రాజమౌళి థ్యాంక్స్ చెప్పాడు.  ‘లైఫ్ ఇప్పుడు కొంచెం సింపుల్ గా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసి తన ఆనందాన్ని తెలియచెప్పాడు జక్కన్న.

Leave a Reply

Your email address will not be published.