ప్రభాస్ కోసం రాజమౌళి రాజీ

ఎదిగే కొద్దీ ఒదగమనీ …అని ఓ పాటుంది. కొంతమంది విషయంలో ఇది అక్షరాలా నిజం. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతటి స్థాయికి చేరినా అతి సామాన్యంగా, అణకువగా ఉండడం కొద్దిమందికే చెల్లుతుంది. ఒక పదవి వచ్చినా, ఒక విజయం వరించినా ఇగోతో మిడిసిపడే మనుషులున్న ఈ రోజుల్లో ఓ ప్రముఖ డైరెక్టర్ ఎంతో నిరాడంబరంగా ఉండడం ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు…తన హీరో కోసం తన పద్ధతినే మార్చుకున్నాడు.

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. ఆ సినిమా గురించి, దర్శకుడు రాజమౌళి గురించి తెలీనివారు లేరంటే అతిశయోక్తి కాదు. బాహుబలి అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించినా…రాజమౌళి మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటాడు. అతనితో సన్నిహితంగా ఉన్నవారికి ఈ సంగతి తెలుసు. మిగతా టాప్ డైరెక్టర్స్ లా లగ్జరీస్ జోలికి వెళ్లడు. విలాసమైన కార్లు, భవనాలు ఆయనకు లేవంటారు.

రాజమౌళి స్థాయిలో మరో డైరెక్టరుంటే క్లబ్ లు, పబ్ లు, పార్టీలూ తప్పనిసరి. కానీ  జక్కన్న వీటికి దూరంగా ఉంటాడు. తన ప్రొఫెషన్ మీదే కాన్ సన్ ట్రేట్ చేసే రాజమౌళి ఎక్కువగా తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఇష్టపడతాడు. పండగలకు బంధువులందరూ ఆయనింటికి వచ్చి సరదాగా గడుపుతారు. అదే ఆయనకు ఆనందం. పార్టీలంటే ఇష్టముండదట. టాప్ డైరెక్టర్ అంటే ఏదో ఒక ప్రచారం జరుగుతుంటుంది. కానీ రాజమౌళిపై ఎలాంటి ప్రచారాలూ లేవు.

పార్టీలకు దూరంగా ఉండే రాజమౌళి తన హీరో ప్రభాస్ కోసం టెంపరరీగా తన పద్ధతి మార్చుకున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజునాడు తను అతనికి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడట. ఈ పార్టీకి బాహుబలి యూనిట్ ను మాత్రమే కాక టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఆహ్వానిస్తాడట. తనకోసం ప్రభాస్ అన్ని సినిమాలనూ వదులుకొని పనిచేస్తున్నాడు. కష్టపడుతున్నాడు. అందుకు కృతజ్ఞతగా రాజమౌళి కాస్త కాంప్రమైజ్ అయి ఈ పార్టీ ఇస్తున్నాడట.

Leave a Reply

Your email address will not be published.