కేసులు పెడతా నంటున్న రాధిక

నటి రాధిక మరో పెళ్లి చేసుకోబోతుందంటూ వచ్చిన వార్తలపై ఆమె మండి పడింది. ఇప్పటికే వైవాహిక జీవితంలో బిజీగా వున్న రాధిక భర్తను వదిలి వేరే పెళ్లి చేసుకోవడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాధిక వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా గడుపుతున్న టైంలో ఇటువంటి రూమర్స్ పుట్టుకు రావడంపై ఆమె స్పందించింది. ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై కేసులు పెడతా అని హెచ్చరించింది.

మళ్ళీ వివాహం చేసుకోబోతుందని వచ్చిన వార్తలను ఒకప్పటి ఈ కన్నడ సినీ నటి ఖండించింది. అలాంటి వార్తలను రాసేవారిపై కేసులు పెడతానని హెచ్చరించింది. రాధిక మాజీ కర్నాటక సీఎం హెచ్ డి కుమార స్వామిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే కుమార స్వామి వేరొకరిని పెళ్ళి చేసుకున్నప్పటికి ఆయన్ను వివాహం చేసుకుంది రాధిక. ఇప్పుడు వీరిద్దరికి ఓ కుమార్తె కూడా.

కన్నడ నటి రాధిక ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. సినిమా నిర్మాత ప్రొడ్యూసర్ కూడా అయిన కుమార స్వామితో పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి వివాహ జీవితం సజావుగానే వుందట. ఇలాంటి తరుణంలో వారిద్దరు విడిపోతున్నారని, రాధిక ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతుందని వార్తలు రావడాన్ని రాధిక ఖండించింది.

మంగళూరు బిజినెస్ మ్యాన్ వివేక్ రాయ్ తో రాధిక దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చారు కొందరు. ఆమె అతనితొ గత కొంతకాలంగా ప్రేమలో ఉందని, అతన్నే పెళ్ళి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె విరుచుకుపడింది.

Leave a Reply

Your email address will not be published.