గోపీచంద్, నితిన్ లతో మూవీలు

త్వరలో విడుదల కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నిర్మాత కె.కె.రాధామోహన్ స్పీడ్ పెంచాడు. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు… మూడు చిత్రాలను నిర్మించడానికి రెడీ అయ్యాడు. అది కూడా మాములు హీరోస్ తో కాదు. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న హీరోలతోనే. ఇక ఈ చిత్రాలకి సంబంధించి రిలీజ్ డేట్‌ కూడా ఫిక్స్ చేశాడు ఆ చిత్ర నిర్మాత.

అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత కెకె రాధామోహన్ ఇటీవల నవీన్ చంద్ర, పృధ్వీ ప్రధాన పాత్రలలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే చిత్రాన్ని తీసాడు. ఈ చిత్రం నవంబర్ లో థియేటర్స్ కి రానుంది. ఇప్పుడు రాధామోహన్ పాపులర్ హీరోస్ తో మరి కొన్ని సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యాడు.

మొదట యంగ్ హీరో నాగ శౌర్యతో ఓ సినిమా చేయాలని భావిస్తున్న రాధామోహన్ ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఆ తర్వాత గోపిచంద్ తో ఓ చిత్రం, లవర్ బోయ్ నితిన్ తో ఓ చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాడట. 
ప్రస్తుతం గోపీచంద్ ఆక్సిజన్ మూవీతోనూ…అలానే సంపత్ నంది, బి.గోపాల్ చిత్రాలతో బిజీగా వున్నాడు. ఈ చిత్రాలన్నీ రిలీజ్ కావాలంటే మరో అర్నెల్లయినా పట్టొచ్చు.

గోపిచంద్‌ తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసాకే కె.కె.రాధామోహన్ నిర్మాణంలో నటించొచ్చు . ఇక నితిన్‌ అ..ఆ మూవీ తర్వాత మరే సినిమాకు ఒప్పుకున్నట్టు గా కనిపించడం లేదు. దాంతో రాధామోహన్ సినిమా చేయడం నితిన్ కి పెద్ద ఇబ్బంది ఉండకపోచ్చు.  ఈ సినిమాలకు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనుండగా, వచ్చే సమ్మర్ కి ఈ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్‌.

Leave a Reply

Your email address will not be published.