పూరీ ‘కొత్త’రూట్

డైరెక్టర్లు ఎప్పుడూ కమర్షియల్ మూవీస్‌ మాత్రమే కాదు … అప్పుడప్పుడూ కొన్ని ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేస్తుంటారు. మాస్ మసాలా సినిమాలే కాక క్లాస్ పిక్చర్స్ కూడా చేస్తారు. మంచి కథలపై సిట్టింగ్ వేస్తారు. అంతేకాదు .. స్టార్ డమ్ ఉన్న సెలెబ్రిటీలతోనే కాక , కొత్తవారితో కూడా సినిమా తీసి సక్సెస్ కావాలనుకుంటారు.  స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు అలాంటి ఎక్స్ పెరిమెంటే చేయబోతున్నాడు. 

కొత్తవారితో తీసినా దర్శకుడిగా తనకున్న పేరుతో పిక్చర్ కు గ్యారెంటీ ఉంటుందన్న ధీమా కొందరు డైరెక్టర్లకు ఉంటుంది. అలాంటి ధీమా ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. స్టోరీలోనూ, టేకింగ్ లోనూ పూరీకి ఓ స్పెషాలిటీ ఉంది. ఆ ప్రత్యేకత అతని అన్ని సినిమాల్లో కనిపిస్తుంది. అందువల్లే అతను ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకున్నాడు. అయితే ఈమధ్య  వరసగా సినిమాలు చేస్తున్నా విజయాలు మాత్రం ఆ రేంజ్ లో లేవు.

స్టార్ హీరోలు ఎప్పుడూ  సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ నే ఎంచుకుంటారు. ఫలానా డైరెక్టర్ ఏమాత్రం వెనకబడినా .. ఒకటి రెండు ఫ్లాప్ లు వచ్చినా  అతన్ని పట్టించుకోరు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్  స్టార్ హీరోస్ తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నా ఎవరూ కన్ ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఎలాగైనా హిట్ కొట్టి చూపించాలని డిసైడైన పూరీ జగన్నాథ్ రూట్ మార్చాడు.

కొత్త వాళ్లతో తీయబోయే పిక్చర్ ను సొంత బ్యానర్ పై లో బడ్జెట్ లో తీయాలనుకుంటున్నాడట. ఈ సినిమాకు హీరో హీరోయిన్లతో సహా నటీనటులందరూ కొత్తవారే ఉంటారట. పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్లి స్టోరీపై వర్క్ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఆ స్టోరీ ఈ  సినిమాకోసమే అని తెలుస్తోంది.  కథ రెడీ కాగానే షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట పూరీ జగన్నాథ్.

Leave a Reply

Your email address will not be published.