పూరీ డైరక్షన్ లో మల్టీ స్టారర్

టాలీవుడ్ లో సింగిల్ హీరో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లు కూడా వస్తున్నాయి. సోలో హీరో సినిమాలు ఇరవై వస్తుంటే మల్టీస్టారర్స్ ఒకటీ అరా వస్తున్నాయి.  సీనియర్ హీరోలు సోలోనే చేస్తానని పట్టుదలకు పోకుండా మల్టీ స్టారర్స్ కు ఈజీగా ఓకే చెబుతున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా మల్టీ స్టారర్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదివరకు ఎప్పుడో మూడు నాలుగేళ్లకు మల్టీ స్టారర్ మూవీస్ వచ్చేవి. ఇప్పుడు ఏడాదికి రెండు మూడు వస్తున్నాయి.  స్లోగా నంబర్ పెరుగుతోంది. మూడు నాలుగేళ్లుగా ఈ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ అయిందనవచ్చు. ఇప్పటిదాకా ఒక సీనియర్ హీరో, మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్లు వచ్చాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఇద్దరు యంగ్ హీరోలతో  మల్టీస్టారర్స్ వస్తున్నాయి. ఈమధ్య  నారా రోహిత్, నాగశౌర్యతో  జో అచ్యుతానంద  పిక్చర్ వచ్చింది. అలాగే .. .. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ ల కాంబోతో మరో  మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా  ఇద్దరు స్టార్ హీరోస్ తో ఇంకో మూవీకి ప్లానింగ్ జరుగుతోంది.

జూనియర్ ఎన్ టీఆర్, అల్లు అర్జున్ లతో  ఓ మూవీ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. దీనిని స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయవచ్చట. పూరీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో  విడివిడిగా  సినిమాలు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరితో  సినిమా అంటే  ఫ్యాన్స్ కు పండగే పండగ. ఈ సినిమాకోసం యంగ్ టైగర్ కు, స్టైలిష్ స్టార్ కు పూరీ ఇప్పటికే  ఓ స్టోరీ వినిపించాడని కూడా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.