పూరీ మెచ్చిన మొబైల్ గాడ్జెట్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఎంతో కొంత విజ్ఞానాన్ని అందించాలని ప్రయత్నిస్తాడు. ఒకవైపు కమర్షియల్గా అలరిస్తూనే తన సినిమా ద్వారా వీక్షకులకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం అనే చిత్రాన్ని చేస్తున్న పూరీ జగన్నాథ్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఓ గాడ్జెట్ ని పరిచయం చేశాడు. ఈ పరికరం ఉపయోగాలు, పనిచేసే విధానం తెలిస్తే మీరు షాకవుతారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఖాళీ సమయాల్లో ఎక్కువగా తన మొబైల్ తోనే కాలం గడుపుతూ ఉంటాడు. మార్కెట్ లోకి వచ్చిన ప్రతీ యాపిల్ ప్రాడక్ట్ ను వెంటనే సొంతం చేసుకునే పూరి, టెక్నాలజీ పరంగా కూడా ఎప్పుడూ అప్ డేట్ అవుతూనే ఉంటాడు. అందుకే తన డ్రీమ్ హోం కేవ్ ను అధునాతన టెక్నాలజీతో విలక్షణంగా నిర్మించాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ సోషల్ మీడియా వేదికగా గాడ్జెట్ గురుగా మారిపోయాడు.

వెస్ట్రన్ కంట్రీస్ లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ గాడ్జెట్ ను పూరీ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. ఇప్పటి వరకు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ హెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండగా తాజాగా పూరీ షేర్ చేసిన వీడియోలో గాగుల్స్ మోడల్ లో ఉన్న బ్లూటూత్ హెడ్ సెట్ ‘జంగిల్ పాంతర్’ ఆకట్టుకుంటోంది. చూడటానికి మామూలు గాగుల్స్ లాగే కనిపించే ఈ హెడ్ సెట్ తో మ్యూజిక్ ప్లేయర్ ద్వారా పాటలు వినటంతో పాటు, ఫోన్ కాల్స్ ను కూడా అంటెండ్ చేయోచ్చు.

అన్ని రకాల బ్లూటూత్ డివైజ్ లలాగే ఈ జంగిల్ పాంతర్ కూడా ఈజీగా మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అవుతోంది. అంతేకాదు చెవులలో ఎలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండానే స్పష్టంగా కాలర్ వాయిస్ ను వినవచ్చు. 45 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ గాగుల్స్ 5 రకాల కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి వెస్ట్రన్ కంట్రీస్ లోనే అందుబాటులో ఉన్న జంగిల్ పాంతర్ త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి పూరీ పరిచయం చేసిన గాగుల్స్  పై అభిమానులలో ఆసక్తి నెలకొంది.

puri twitter

Leave a Reply

Your email address will not be published.