పబ్లిక్ ఎక్స్ ‘పోజింగ్’ ఎందుకంత?

తెరమీద తళుకులీనే హీరోయిన్స్ ఈమధ్య పబ్లిక్ లైఫ్ లో కూడా ఎక్కువగా కనబడుతున్నారు. తమను అభిమానించే, ఆరాధించే వారికి లైవ్ గా, లైవ్ లీగా కనబడుతున్నారు. వాళ్లను డైరెక్ట్ గా చూసేందుకు జనం కూడా ఎగబడుతున్నారు. ఫ్యాన్స్ ను చూసి సెలెబ్రిటీలు కూడా ఇంప్రెస్ అవుతున్నారు. అయితే ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ కు కొందరు తారలు రెచ్చగొట్టే  డ్రెస్ వేసుకుని వస్తున్నారు. అదే ఈమధ్య హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలకు, సినీతారలకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. వాళ్లకు ఫ్యాన్స్ కూడా లక్షల్లోనే ఉన్నారు. వాళ్లను ప్రత్యక్షంగా చూడాలనే చాలామంది అనుకుంటారు. తారలు దిగివచ్చిన వేళ జనం ఉత్సాహానికి అంతుండదు. సినిమా టిక్కెట్ కోసం, షూటింగ్ చూడ్డంకోసం ఎలా తోసుకుంటారో, ఫంక్షన్స్ కు వచ్చిన తారల్ని చూడ్డానికి కూడా  అలా క్రేజీగా వస్తారు.

షాపింగ్ మాల్స్, కంపెనీల ప్రారంభోత్సవాలకు, ఆడియో ఫంక్షన్స్ కు హీరోయిన్స్ రావడం మామూలైపోయింది.  అలా కూడా  ఆడియన్స్ కు ఆహ్లాదం కలిగిస్తున్నారు, బాగానే ఉంది కానీ ఆయా ఫంక్షన్స్ కు కొందరు వేసుకొచ్చే డ్రెస్లు రెచ్చగొట్టేలా ఉంటోంది.  సినిమాల్లో మాదిరి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు. పబ్లిక్ ఫంక్షన్స్ కు వచ్చే కొందరు హీరోయిన్స్  వేసుకునే డ్రెస్ ను కొందరు ఎంజాయ్ చేస్తున్నా కొన్ని  విమర్శలు కూడా  వస్తున్నాయి. క్లీవేజ్ షో లో నిజంగానే షో చేస్తున్నారు. 

పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు  డ్రెస్ కోడ్ ను పాటించాలి. లేకుంటే లేనిపోని సమస్యలు  ఎదురవుతాయి.  తాము గ్లామరస్ గా కనబడాలని తారలు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ లిమిట్స్ దాటకూడదు కదా.

Leave a Reply

Your email address will not be published.