ప్రియాంక రేపిన టీ షార్ట్ వివాదం

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంకా చోప్రా తాజా మ్యాగజైన్ కవర్ ఫోటో ఇది. ఇందులో ప్రియాంక తెల్లని టీషర్ట్ వేసుకోవడం కనిపిస్తూనే ఉంది. దాని మీద రాసి ఉన్న మాటలూ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ refugee (శరణార్థి), immigrant (వలసదారు), traveller (యాత్రికుడు/యాత్రికురాలు) అనే ఆ మాటలు మాత్రం కొంతమందికి నచ్చలేదట. మొదటి మూడు మాటల్ని ఎరుపు గీతతో కొట్టేసి తనిప్పుడు యాత్రికురాలినని ప్రియాంక చెప్పదలచుకుంది. ప్రియాంక తన ఫోటో ఉన్న మ్యాగజైన్ కవర్ ను ట్విట్టర్ లో ఇలా అభిమానులతో పంచుకుంది. “నా న్యూ కవర్. థాంక్ యూ” అని రాసింది.

34 ఏళ్ల ప్రియాంక ఈ ఏడాది అనేక అంతర్జాతీయ పత్రికల కవర్ పేజీని అలంకరించింది. తన మొదటి హాలీవుడ్ ఫిల్మ్ బే వాచ్ విడుదలకోసం ఎదురుచూస్తోంది. బాగా హిట్టయిన తన టీవీ షో క్వాంటికో ఇప్పుడు రెండో సీజన్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published.