హిట్ కొట్టిన ప్రేమమ్

దసరాకు రిలీజైన సినిమాల్లో ఏది హిట్టయింది, ఏది యావరేజ్, ఏది ఫ్లాప్ అన్నది తెలిసిపోయింది. నాలుగైదు సినిమాలు విడుదలైతే అందులో ఒకటి మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. టాక్ తెచ్చుకోవడమే కాదు… మంచి రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది. ఆ సినిమానే నాగచైతన్య నటించిన ప్రేమమ్. మిగతా సినిమాలకంటే ఈ పిక్చర్ వసూళ్లలో దూసుకెడుతోంది.

దసరాకు జనానికి వినోదాల విందు పంచేందుకు ఒక డైరెక్ట్ మూవీతో పాటు మూడు రీమేక్స్ వచ్చాయి. వీటిలో  ప్రేమమ్, మన ఊరి రామాయణం, అభినేత్రి రీమేక్ సినిమాలు కాగా, ఈడు గోల్డ్ ఎహే డైరెక్ట్ మూవీ. ఈ నాలుగు సినిమాల్లో నాగచైతన్య నటించిన ప్రేమమ్ పై ముందు నుంచీ  హై ఎక్స్ పెక్టేషన్స్  ఉన్నాయి.  ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది.

ఈ మధ్య కొంతకాలంగా నాగచైతన్యకు  చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. నిజం చెప్పాలంటే… గత మూడేళ్ల నుంచీ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ పరిస్థితి లో చైతూ ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు. అతని అంచనాలకు, నమ్మకానికి తగ్గట్టుగానే ప్రేమమ్ హిట్ అయింది. చైతన్య మూవీ హిట్ కావడానికి కారణాలున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండడం కూడా ఆడియెన్స్ ను థియేటర్స్ వైపు లాక్కెడుతోందని అంటున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ మధ్య నాగచైతన్య గ్లామరస్ గా కనిపించాడు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే… రిలీజైన అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురుస్తోది. విడుదలైన 10 రోజుల్లో 20 కోట్ల రూపాయల  షేర్ వచ్చింది. చైతూ నటించిన అన్ని మూవీస్ కన్నా ఈ సినిమా అతని కెరీర్ లో సూపర్ హిట్ మూవీగా మారింది.

Leave a Reply

Your email address will not be published.