ప్రేమమ్ తో హిట్ కొట్టిన చైతూ

మూవీ మేకర్స్ తమ సినిమా ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడతారు. ఎంతగా ప్రమోట్ చేస్తే పిక్చర్ అంతగా సక్సెస్ అవుతుంది. ఒక సినిమా సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, హీరోలు కూడా మనసారా కోరుకుంటారు. ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇటీవల విడుదలైన ప్రేమమ్ సినిమాకు అన్ని దశల్లో, అన్ని విషయాల్లో కింగ్ నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. నాగ్ ఇలా కేర్ తీసుకోడానికి రీజన్ ఉంది.

నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీ రిలీజై సక్సెస్ బాటలో రన్ అవుతోంది. దసరాకు విడుదలైన సినిమాల్లో దీనికి మంచి టాక్ కూడా వచ్చింది. పైగా కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, దసరాకు రిలీజైన ఇతర సినిమాలు అంతంత మాత్రంగా ఉండడం, ఆ తర్వాత కొత్త సినిమాలు అంతగా లేకపోవడం కూడా ప్రేమమ్ కు కలిసొచ్చింది. ఈ పాయింట్స్ వల్ల మాత్రమే పిక్చర్ హిట్ అయిందని చెప్పలేం.

ప్రేమమ్ సక్సెస్ కు టైం బాగుండడంతో పాటు సినిమా కథ పకడ్బందీగా ఉండడం కీలకమైంది. కథ పకడ్బందీగా తయారు కావడానికి వెనక హీరో నాగార్జున ప్లాన్ ఉందని తెలుస్తోంది.మలయాళ సినిమా ప్రేమమ్ ను అదే పేరుతో రీమేక్ చేశారు. రీమేక్ చేసే సినిమాల్లో చాలావాటిల్లో నేటివిటీ కనబడదు. ఈ విషయంలో నాగార్జున కేర్ తీసుకున్నాడు.

ప్రేమమ్ లో మన తెలుగు వాతావరణం కనిపించేలా ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చెప్పడమే కాక, కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేశారట. నాగ్ ఇలా శ్రద్ధ తీసుకోడానికి కారణం గత కొంతకాలంగా నాగచైతన్యకు సరైన హిట్ లేకపోవడమే. కొన్ని సినిమాలు వచ్చినా అవి ఆడియన్స్ కు పట్టలేదు. ఎలాగైనా చైతూ ప్రేమమ్ తో  హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.