బోయపాటిపై పోసాని గరం గరం

పోసాని కృష్ణమురళి దూకుడు బాగా పెరిగింది. ఈమధ్య ఆయన మీడియాలో పలువురి గురించి చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సూటిగా సుత్తిలేకుండా కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడే పోసాని ఓ ప్రముఖఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటిని దుమ్మెత్తిపోసాడు. పోసాని మాటలకు ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. పోసానిది ఆవేశమా, ధైర్యమా, ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుతాడనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది.

యదార్ధవాది లోకవిరోధి అన్నట్టు పోసాని మాట్లాడే తీరుకు చాలామంది నొచ్చుకుంటారు. అయితే ఎక్కువమంది మాత్రం ఆయన నిజాయితీకి సలాం చేస్తుంటారు. ఎదుటివారు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద అధికారంలో వున్నా, జనంలో విపరీతమైన ఫాలోయింగు ఉన్నా వారిని విమర్శించడంలో వెనుకాడడు పోసాని. ఆవేశంవస్తే ఎంతటివారి మీదకైనా దూసుకుపోతాడు.

పోసాని ఈ మధ్య బోయపాటి శ్రీనును  ఎండగట్టాడు. బోయపాటి తన సహాయంతో ఎదిగి తననే ఎలా హర్ట్ చేసాడనేదానిపై ఓపెన్ గా  చెప్పి విరుచుకుపడ్డాడు. తన దగ్గరపనిచేసిన త్రివిక్రం, కొరటాల శివలలా కాదు బోయపాటి అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యల సీడీలు సర్క్యులేషన్ లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో తను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని స్పష్టంచేసాడు పోసాని. జనసేన మ్యానిఫెస్టో వస్తే కాని అతనిపై కామెంట్ చేయనని అన్నాడు. ఏదైనా మంచోచెడో చేస్తే మాట్లాడచ్చు కానీ ఇంకా ఏమీ చేయనివారి గురించి ఏమని మాట్లాడాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

Leave a Reply

Your email address will not be published.