నిండుగా చీర కట్టుకోవాలని ఉంది

పూనం పాండే గురించి తెలియని వారుండరు. హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో పాటు, కాంట్రవర్సియల్ కామెంట్స్ తో ఎప్పుడు మీడియోలో నలిగిపోయే పూనం తన జీవితానికి సంబంధించిన చాలా సీక్రెట్స్ చెప్పేసింది. తనెందుకు అలా వుండాల్సి వస్తుందో ఓపెన్ చేసింది.

పూనం పాండే హాట్ అండ్ సెక్సీ ఐకాన్. ఏ మాత్రం దాపరికం లేకుండా ఓపెన్ గా వుండటంలో ఎటువంటి బెరుకు లేని హీరోయిన్. తను సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ అకట్టుకుంటుంది. పూనం పాండే ఇమేజ్ ఓ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ వుంటుందంటే ఆశ్చర్యం లేదు. అయితే పూనంపాండే తను అందరూ అనుకునే  దానికంటే ఎక్కువ ఇమేజ్ ని సంపాదించానని అంటుంది.

పూనం పాండే చిన్నప్పటినుండి అందరికంటే స్పెషల్ గా వుండాలని కోరుకునేదట. అందుకే జనంలో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి తను హాట్ హాట్ లేడీగా పేరు సంపాదించుకున్నానని అంటుంది. తను ఊహించిన దానికంటే చాలా షార్ట్ టైంలో ఎ క్కువ ఇమేజ్ వచ్చిందని తెగ సంబంరపడిపోతోంది ఈ హాట్ లేడీ. పద్దతిగా వుంటే ఎవరూ పట్టించుకోరనేది ఆమె అభిప్రాయం.

పూనంకి వున్న ఇమేజ్ పై తన కుటుంబంలో చాలా అసంతృప్తి వుందట. తన ఫొటోలను సోషల్ మీడియాలో చూసి తన తల్లి పూనంని చీవాట్లుపెట్టిందట. దానికి తోడు ఇంట్లో పూనం ఫాదర్ స్ట్రిక్ట్ అవడంతో తొలిరోజుల్లో చాలా ఇబ్బందులు పడిందట పూనం. అయితే తను అనుకున్న టార్గెట్స్ రీచ్ అవడానికి తను ఆ మార్గంలో ఎంత కష్టపడుతున్నది చూసాక వారు సైలెంట్ అయ్యారని ఇప్పుడు తన పద్దతిని వారు సమర్ధిస్తున్నారని అంటుంది ఈ హాట్ లేడి.

ఎప్పుడూ 2పీస్ డ్రస్సుల్లో వుండే పూనం పాండేకి చీరలు కట్టుకోవడం అంటే ఇష్టమట. మామూలు రోజుల్లో కూడా చీరల్లోనే తిరగాలనిపిస్తుంది కాని ప్రస్తుతం వున్న తన మార్క్ ఇమేజ్ కి అది సాధ్యం కాదని అంటుంది పూనంపాండే. అవకాశం వస్తే నిండుగా చీరకట్టుకునే క్యారెక్టర్ లో నటించాలనుందని మనసులోని మాట చెప్పుకొచ్చింది పూనం.

Leave a Reply

Your email address will not be published.