పవన్ ని మళ్ళీ ట్వీటిన వర్మ

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వంగవీటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో వర్మ కులాల ప్రసక్తిని తన దైన ధోరణిలో తీసుకువచ్చాడు. రెండు అర్ధాలు వచ్చేలా కులాల పేర్లను ఉపయోగిస్తూ తెలివితేటలు చూపించాడు. అయితే అంతటితో ఆగకుండా తను ప్రయోగించిన పదాలను పవన్ కల్యాన్ పై విసిరి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.

రాంగోపాల్ వర్మ ముంబైకి వెళ్ళిన తరువాత పవన్ కల్యాన్ పై ఇకనుండి ఎటువంటి ట్వీట్లు చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాన్ కి వున్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని వారిని హర్ట్ చేయడం ఇష్టంలేక పవన్ పై ట్వీట్లు మానుకుంటున్నానని మాటిచ్చాడు. అయితే వర్మ ఆ మాట తప్పి పవన్ కల్యాన్ అభిమానులందరిని భాదించేలా ట్వీట్ చేసాడు.

వంగవీటి సినిమా ట్రైలర్ లో వంగవీటి రంగాను ఉద్దేశిస్తూ కాపు కాసే శక్తి అని కుల ప్రస్తావన తీసుకు వచ్చాడు వర్మ. పాటలో రెండో అర్ధం వచ్చేలా వున్నప్పటికీ వర్మ అసలు ఉద్దేశ్యం తెలుస్తూనే ఉంది. పవన్ కల్యాన్ పై రాం గోపాల్ వర్మ తన తాజా ట్వీట్ లో, మొత్తం తెలుగు ప్రజలందరికీ పవన్ కల్యాన్ కమ్మగా కాపు కాసే శక్తి అవుతాడని, అత్యున్నత నాయకుడు వాడవుతాడని అన్నాడు. ఇక్కడ కమ్మ అంటే కాపు, కమ్మ అని కాదని, కమ్మ అంటే స్వీటని పేర్కొన్నాడు.

రాంగోపాల్ వర్మ పవన్ కల్యాన్ ని కులాలకు లింకు చేసి మాట్లాడటం అభిమానులకు సహించట్లేదు. కుల వ్యవస్థను కూలదన్నాలనే ఉద్దేశ్యంతో పవన్ ముందుకెళుతుండగా, పవన్ కల్యాన్ ని కమ్మ కాపు అనే వాటికి తగిలించి ట్వీట్లు చేయడం ఎవరికి మింగుడు పడట్లేదు. అయితే వర్మ వర్షెన్ ఇంకోలా వుంది. సంకుచిత భావాలు గల కొందరు భావిస్తున్నట్టు ఇక్కడ కులాల ప్రస్తావన లేదని వర్మ ప్లేట్ ఫిరాయించాడు.

Leave a Reply

Your email address will not be published.