ఎన్నికల్లోగా 4 సినిమాలు

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’  అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా, ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఫిబ్రవరికి ఈ సినిమాను రిలీజ్ ప్లాన్ చేసిన పవన్ ఆ తర్వాత మరో మూడు సినిమాలపై దృష్టి పెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత పూర్తి రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టనున్నాడని ఇన్ సైడ్‌ న్యూస్ .

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  రెండు బాధ్యతలను మోస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఒక వైపు జనసేన అధ్యక్షుడిగా, మరో వైపు టాలీవుడ్ టాప్ హీరోగా ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. అయితే 2019లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అటు సినిమా, ఇటు రాజకీయాలకు సంబంధించి తన భవిష్యత్ కార్యాచరణను పక్కాగా రూపొందించుకుంటున్నాడని తెలుస్తోంది. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రాన్ని చేస్తోన్న పవన్ 2017 ఫిబ్రవరి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

కాటమరాయుడు మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్  ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీ 2017లో పట్టాలెక్కనుంది. ఇక ఇదే సంవత్సరంలో ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నాడట. ఇక 2018లో  మరో రెండు చిత్రాలు  చేయాలనుకుంటున్న పవర్ స్టార్ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు టాక్. అంటే మొత్తం మీద పవన్ ఎన్నికలకు ముందు నాలుగు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడనమాట.

ఇటీవల పవన్ కి గబ్బర్ సింగ్‌ లాంటి హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్ తో ఓ మూవీ ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో 2017లో పవన్  చేయబోయే రెండో మూవీ ఇదే అని అర్ధమవుతోంది. ఇక 2018లో పవన్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనేది కాస్త సస్పెన్స్ గానే మారింది.

Leave a Reply

Your email address will not be published.