షూటింగ్ కు పవన్ రెడీ

పాలిటిక్స్ తో కొంతకాలం సినిమా ఊసెత్తని పవన్ కల్యాన్ బ్యాక్ టు వర్క్ అంటున్నాడు. ఏపీ ప్రత్యేక హోదాపై తన ఆవేశాన్ని వెలిబుచ్చిన ఆయన ఇప్పుడు చల్లబడ్డాడు. ఇప్పటికే పవన్ కల్యాన్ తిరుపతి, కాకినాడ మీటింగుల వల్ల కాటమ రాయుడు సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఆలస్యం చేస్తే మిగిలిన నటీనటులకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కల్యాన్ రంగంలోకి దిగింది. కాటమరాయుడు షూటింగ్ లో ఈ నెల 24నుండి పాల్గొబోతున్నాడు.

పవన్ కల్యాన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. అటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఇటు సినిమాలపై దృష్టిపెడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రత్యేక హోదాపై గళమెత్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కించాడు. ప్రజాప్రతినిధులు ఏమీ చేయలేమని చేతులెత్తేసే పరిస్థితుల్లో తాను పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతానని చెప్పిన పవన్ కల్యాన్ ఈ గ్యాపే లో సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

కాటమరాయుడు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి వుంది. అయితే పవన్ కల్యాన్ పూర్తిగా రాజకీయాలకోసం టైం కేటాయించడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. శృతీ ఇప్పటికే తను ఇండివిడ్యుయల్ గా చేసే సీన్లను కంప్లీట్ చేసుకున్నది. ఇక పవన్ కాంబినేషన్ లోవున్న సీన్లు చేయడంకోసం చాలా కాలంగా తన డెట్స్ డిస్ట్రబ్ చేసుకుని మరీ ఎదురు చూస్తుందట. ఒక స్థాయిలో సహనం కోల్పోయిందనే వార్తలు కూడా వచ్చాయి.

కాటమరాయుడు సినిమాలో శృతీ హాసన్ తో పాటు కీచకుడు సినిమాలో హీరోయిన్ గా చేసిన యామిని భాస్కర్ ను తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ అమ్మాయి సెకెండ్ హీరోయిన్ గా చేస్త్తుందా లేదంటే అందులో ఒక చిన్న పాత్ర పోషిస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. ఈ సినిమాను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలి అని పవన్ చెపుతూ ఉన్నా అది జరిగే పనేనా ? అన్న అనుమానం ఈ సినిమా యూనిట్ సభ్యులకు ఉన్నట్లు టాక్.

Leave a Reply

Your email address will not be published.