వెంకీ సినిమాలో పవన్ ప్రస్తావన

విక్టరీ వెంకటేష్ సినిమాలో పవన్ కళ్యాన్‌ ప్రస్తావన రానుందని అంటున్నారు. తమిళ హిట్‌ మూవీకి రీమేక్ గా వెంకీ ఓ చిత్రాన్ని చేస్తోండగా ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలాసార్లు వస్తుందని  టాక్ నడుస్తోంది. అంటే,  గోపాల గోపాల మల్టీస్టారర్ చిత్రంలో పవన్ గోపాలుడిగా కనిపించినట్టు వెంకీ చిత్రంలోను స్పెషల్‌ రోల్‌ లో కనబడతాడా,  మరో ప్రత్యేక కోణం ఉంటుందా అనే దానిపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది.

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత ఇమేజ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. మెగా హీరోలే కాకుండా, కొందరు యవ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న కమెడీయన్ సప్తగిరి తన తాజా చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకకి పవన్ ని గెస్ట్ గా పిలిచి, అందరి దృష్టి తన సినిమాపై పడేలా చేశాడు. ఇక ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ తన సినిమాకు పవన్ ఇమేజ్ ని వాడుకోవాలని భావిస్తున్నాడట. 

వెంకీ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్టయిన ఇరుదు సుట్రు కు రీమేక్ గా గురు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. బాక్సర్ గా తాను సాధించలేనిది తన శిష్యులతో సాధించాలని తపించే ఒక కోచ్ పాత్రలో వెంకీ నటిస్తోండగా, అతని శిష్యురాలిగా మాతృకలో నటించిన రితికా సింగ్ నటిస్తోంది. అయితే తమిళంలో కథానాయికని థనుష్ ఫ్యాన్ గా చూపించారు చిత్ర బృందం. మరి తెలుగుకి వచ్చే సరికి కథానాయిక ఫ్యాన్ గా ఏ హీరోని చూపించాలనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉండగా వెంకటేష్, పవన్ ని సూచించాడట. 

పవన్ తో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఉండగా వీరిద్దరూ కలిసి గోపాల గోపాల అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫ్యాన్ గా పవన్ నే చూపించాలని రికమెండ్ చేసాడట వెంకీ. కనుక సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలాసార్లు రానుందన్నమాట.

Leave a Reply

Your email address will not be published.