సప్తగిరి ఆడియోకి పవన్

టాలీవుడ్ లో అతి తక్కువకాలంలో స్టార్ కమెడియన్ గా ఎదిగిన వ్యక్తి సప్తగిరి. అతి తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటిని తెచ్చుకున్నాడు. పోస్టర్ పై సప్తగిరిని చూసి థీయేటర్ కి వెళ్ళే వాళ్ళు కూడా వున్నారు. అటువంటి కమెడియన్ ఇప్పుడు ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతే కాదు, ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ గెస్ట్ గా రాబోతున్నాడు. సొంత ఇంటి ఫంక్షన్ లకే వెల్లని పవర్ స్టార్ సప్తగిరి ఆడియో రిలీజ్ కి ఎందుకు వెళుతున్నాడనుకుంటున్నారా?

స్టార్ కమెడియన్ స్టేటస్ ను అనుభవిస్తున్న సప్తగిరి `సప్తగిరి ఎక్స్ ప్రెస్` పేరుతో రాబోతున్న ఓ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో బ్రహ్మానందం, అలీలు కూడా కమెడియన్లుగా వుంటూనే హీరో గా సినిమాలు చేశారు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు సప్తగిరి.

సప్తగిరి హీరోగా చేయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అయితే సప్తగిరి హీరోగా చేసిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట. సొంత కుటుంబంలో ఫంక్షన్లకే హాజరుకాని పవన్ కళ్యాన్ సప్తగిరి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి రాబోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరో ఒక కమెడియన్ హీరోగా చేసే సినిమా ఫంక్షన్ కి రావడం వెనుక కారణమేంటి అనే విషయం పై చర్చలు మొదలయ్యాయి.

పవన్ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి వస్తాడనే వార్త వెనుక బలమైన కారణం వుంది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ సినిమా కాటమరాయుడు టైటిల్ సప్తగిరి చేస్తున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాదే. గతంలోనే కాటమరాయుడు సినిమా రిజిస్ట్రేషన్ అయింది. కాగా పవన్ కళ్యాన్ సినిమాకు ఆ టైటిల్ అవసరం అవడంతో నిర్మాతలు రిక్వెస్ట్ చేసి ఆ టైటిల్ తీసుకున్నారు. ఈ సందర్భంలో సప్తగిరి చాలా హెల్ప్ చేసాడట. అందుకు కృతఙ్ఞతగా పవన్ కళ్యాన్ ఈ ఆడియో వేడుకకు వెళ్ళనున్నాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.