ఏలూరులో పవన్ ఇల్లు రెడీ

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ తనకు తెలంగాణాలో వున్న  ఓటు హక్కును ఉపసంహరించుకున్నాడు. తనకు ఏలూరులో ఓటుహక్కు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. తను పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయనేతగా మారదలచుకున్నాడు పవన్ కళ్యాన్. ఏలూరులో తను వుండటానికి ఓ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

రాజకీయనాయకులు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అందుకేనేమో పవన్ కళ్యాన్ తను ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికోసం పూర్తిగా పనిచేయబోతున్నట్టు తెలిపాడు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో  పవన్‌కల్యాణ్ ఇంటి పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాన్ ఏలూరులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్న  సంగతి ఇప్పుడే బయటపడినా, ఇంటి నిర్మాణం మాత్రం ఎప్పుడో మొదలయిందనిమ ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ లో వున్నాయని అంటున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి రూ. 15 కోట్లు వెచ్చించినట్టు  సమాచారం.

పవన్ కళ్యాన్ ఈ  నివాసంలోనే వుంటాడా, లేదంటే దాన్ని పార్టీ కార్యకలాపాలకోసం వినియోగిస్తారా అనేదానిపై క్లారిటి లేదు. హైదరాబాద్ లో వుంటూ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడం పవన్ కి ఇబ్బందిగా మారింది. అందులోను అక్కడ జరగబోయే కార్పోరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని  జనాలతో వీలైనంత దగ్గరగా వుండాల్సిన అవసరం వుండటంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది.

అతి త్వరలో పూర్తిస్థాయిలో  క్రియాశీల రాజకీయాల్లో నిమగ్నమవుతానని ఇప్పటికే పవన్ సిగ్నల్స్ ఇచ్చాడు. ఇక సినిమా షూటింగ్ ల సమయంలో మాత్రమే పవన్ కళ్యాన్ హైదరాబాద్ లో వుండబోతున్నాడు. మిగతా సమయమంతా ఏలూరులోనే వుండి చక్రం తిప్పుతాడని అభిమానులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.