పట్టాల కెక్కని ఓ సినిమా

పవన్ కళ్యాన్, తనికెళ్ళ భరణి ఇద్దరూ ఆధ్యాత్మిక చింతన వున్నవారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేద్దామనుకున్నారు. పవన్ కళ్యాన్ కోసం తనికెళ్ళ భరణి ఓ కథ కూడా వినిపించాడట. పవన్ కళ్యాన్ కి ఆ కథ నచ్చిందట కూడా. మరి ఇంత జరిగి సినిమా పట్టాలెందుకు ఎక్కలేదంటారా…

తనికెళ్ళ భరణి మంచి నడుడే కాదు శివ భక్తుడు కూడా. ఆయన శివుడిపై చేసిన ఓ పాటల సీడి కూడా అందరికి సుపరిచితమే. శివుడిపై సామాన్యుడు కూడా అర్ధచేసుకునేలా తత్వాలు రాసాడు తనికెళ్ళ భరణి. శివ తత్వంపై భరణికి లోతైన అవగాహన వుంది. పైకి సినిమాల్లో విలన్ పాత్రల్లో అదరకొట్టే  ఈ శివభక్తుడు భయట గొప్ప ఆధ్యాత్మిక వేత్త కూడా.

తనికెళ్ళ భరణి తను రాసిన తత్వాల సీడిని పవన్ కళ్యాన్ కి ఇచ్చాడట.అవి విన్న పవన్ కళ్యాన్ ఓ రోజంతా ఆ తత్వాలలో లీనమై షూటింగ్ కి కూడా రాలేకపోయాడట. ఆ సమయంలోనే పవన్ కళ్యాన్ కి తనికెళ్ళ భరణి భక్త కన్నప్ప సినిమా కథ వినిపించాడట. పవన్ కళ్యాన్ కి కూడా భరణి చెప్పిన కథ నచ్చినప్పటికి ప్రాజెక్ట్ మాత్రం ముదుకు వెళ్ళ లేదు.

అప్పటికి పవన్ ఫ్లాపుల్లో వున్నాడు. దాంతో కొన్ని హిట్లు పడ్డాక చేద్దామని పవన్ అన్నాడట. ఈ కథను భారీగా చేస్తేనే వర్కౌట్ అవుతుందని పవన్ తన అభిప్రాయాన్ని తెలిపాడట. ఇప్పుడు పవన్ కళ్యాన్ కి భారీ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లు వున్నప్పటికి పాలిటిక్స్ లో యాక్టివ్ అవడంతో పవన్ ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడట. ఇక చేసేది లేక అదే కథతో మంచు విష్ణుని పెట్టి భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.