పవన్ – త్రివిక్రమ్ సినిమాలో అ..ఆ.. హీరోయిన్స్

సినిమావారి సెంటిమెంట్లలో  కాంబినేషన్ సెంటిమెంట్ ఒకటని చెప్పవచ్చు. ఒక సినిమా సక్సెస్ అయితే అందులో యాక్ట్ చేసిన హీరో, హీరోయిన్స్ తోనే మరికొన్ని పిక్చర్స్ తీస్తారు. ఈ సెంటిమెంట్  హీరో- డైరెక్టర్ కాంబినేషన్ కు కూడా వర్తిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే .. .. ఒక స్టార్ హీరో, మరో స్టార్ డైరెక్టర్ తమ సినిమాల్లో ఇదివరకు చేసిన హీరోయిన్స్ నే నెక్ట్స్ పిక్చర్ కి తీసుకున్నారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ -పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఇంతకు ముందు  ‘జల్సా’ .. ‘ అత్తారింటికి దారేది’ సినిమాలు వచ్చాయి. వాటిలో జల్సా ఓ మాదిరిగా రన్ అయినా … అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్ గా స్టాండ్ అయి, రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాల్లో మరో విశేషమేమంటే .. .. పవన్ కళ్యాణ్ తో ఇద్దరు హీరోయిన్స్ నటించడం.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ – త్రవిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా  మూడో సినిమా రాబోతోంది. ఈ  సినిమాకు ఇటీవల ముహూర్తం కూడా జరిగింది. త్రివిక్రమ్ తో పవన్ ఇదివరకు చేసిన రెండు సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోను  పవర్ స్టార్ కు ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. పవన్  -త్రివిక్రమ్ మూవీకి ఇప్పటికే ఒక హీరోయిన్ గా సమంతను  సెలెక్ట్ చేశారు.

ఈ పిక్చర్ కు  సెకండ్ హీరోయిన్ గా  అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారని టాక్. విశేషమేంటంటే  ఈ ఇద్దరు హీరోయిన్స్  కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అ ఆ’ సినిమాలో చేశారు. సో .. .. ఆ పిక్చర్ లో ఉన్న హీరోయిన్  కాంబినేషన్ నే ఈ సినిమాలో రిపీట్ చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్  అ..ఆ.. లో చక్కగా నటించడం వల్లే  త్రివిక్రమ్ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.