Parakala Justifies Social Media Arrests In AP, Discounts Katju’s remarks

In less than 24 hours after Justice Katju sought dismissal of AP government for arresting people for the social media postings, AP government advisor Parakala justified the arrests discounting Justice Katju’s comments.

Amaravati: The AP government advisor Parakala Prabhakar justified the arrest of Inturi Ravi Kiran and Ippala Ravindra Reddy for their postings in the social media. He also discounted the comments of Supreme Court retired judge Justice Markandey Katju on the arrests and his demand for imposition of President Rule in the State. He said that Justice Katju’s comments against the AP government were uncalled for and there was no need for the government to worry about them. He said that the retired judge had made similar comments against Supreme Court, Supreme Court Judges and Journalists in the past and withdrew later.

Prabhakar said that both Ravi Kiran and Ravindra Reddy have posted several derogatory cartoons, caricatures and morphed photographs causing personal damage to several leaders, including women. The photographs and the comments were most derogatory and were of not in good taste, he said. While welcoming constructive criticism on the government and leaders, Prabhakar felt that these comments were in violation of the freedom of expression. He expressed confidence that Justice Katju would withdraw his remarks against the government after looking at the postings of these two persons in the social media.

He blamed Leader of Opposition Y S Jagan Mohan Reddy for supporting these persons and condemning the arrests. He wanted to know whether Jagan Mohan Reddy had seen the obscene photos that these persons have posted in the social media. “Be it Justice Katju or Jagan, they would go back on their words once they see these postings which are highly objectionable and derogatory,” Prabhakar asserted.

Leave a Reply

Your email address will not be published.

ఓ జోకర్ భద్రత భారం జనం మీదా?

  • అర్నబ్ కు భద్రత వార్తపై మార్కండేయ్ కాట్జూ విసుర్లు

టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నబ్ గోస్వామికి హోమ్ మంత్రిత్వ శాఖ ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనుందన్న వార్తపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ మార్కండేయ్ కాట్జూ తనదైన శైలిలో స్పందించారు. “పొగరు తప్ప బుర్రలో సరుకేమీలేని ఈ జోకర్ కు రాత్రీ పగలూ కాపలా కాయడానికి ప్రభుత్వం 20 మంది గార్డులను ఏర్పాటు చేయబోతోంది. హరి ఓం” అని ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో ఆయన వ్యాఖ్యానించారు.

ఆయనే మరో పోస్టులో ఇంకా ఇలా అన్నారు:

“అర్నబ్ గోస్వామికి భద్రతను, అందులోనూ 20 మంది గార్డులతో వై కేటగిరీ భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించాలి? ఈ గార్డులకు జీతాలు ఎవరిస్తారు? ప్రభుత్వమే ఇస్తుంది, అంటే వాస్తవంగా  ప్రజలు. వాళ్ళు చెల్లించే పన్నుల్లోంచే ఈ జీతాలు చెల్లిస్తారు. ఆవిధంగా  మనందరం అర్నబ్ భద్రత ఖర్చును మోయాలన్నమాట.

అర్నబ్ కు కచ్చితంగా తన యజమాని నుంచి పెద్ద మొత్తంలో జీతం వస్తూ ఉంటుంది. తన భద్రత ఖర్చును తన జేబులోంచే పెట్టుకోవచ్చుగా? సాయుధ గార్డులను సమకూర్చే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. అర్నబ్ డబ్బు చెల్లించి వాళ్ళను నియమించుకోవచ్చుకదా? లేదా, ఆయన యాజమాన్య సంస్థ బాగా డబ్బున్న వ్యాపార సంస్థ కనుక అది పెట్టుకోవచ్చు. ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తే ఇంకా మరికొంతమందికి కూడా ఇలాంటి భద్రత కల్పిస్తూ ఉండచ్చు. ఇది ఎంతైనా విచారించవలసిన విషయం కాదా? ఈ కిరాయి ‘పచ్చబొట్లు’, బఫూన్ల  ఖర్చు భారాన్ని ప్రజలు మోయాలా?”

Leave a Reply

Your email address will not be published.

జయలలిత ప్రేమలో పడిపోయాను

  • సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ్ కట్జూ మరో సంచలన పోస్ట్
  • ఆమె ఆడసింహం, ఆమె ప్రత్యర్థులు కోతులని వ్యాఖ్య

న్యూ ఢిల్లీ: సంచలన వ్యాఖ్యలకు మారు పేరుగా మారిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ్ కట్జూ మరోసారి కొన్ని సంచలన విషయాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఒకవైపు తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతుండగా ఆ పోస్ట్ లో ఆయన జయలలితపై తన ‘ప్రేమ’ ను చాటుకున్నారు.

తనూ, ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవారనీ, ఆమె ప్రేమలో పడిపోయాననీ, అయితే ఆ సంగతి ఆమెకు తెలియదని రాసుకున్నారు. ఇప్పటికీ ఆమె నాకు ఆకర్షణీయంగానే కనిపిస్తారనీ(దురదృష్టవశాత్తూ తను ఆకర్షణీయంగా లేకపోయినా), ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాననీ చెప్పుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘హరి ఓం’ అనే మాటతో ఫేస్ బుక్ పోస్ట్ ను ముగించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి గురించిన అన్ని వదంతులనూ ఆయన తోసిపుచ్చుతూ ఆమె ఆడసింహమనీ, ఆమె ప్రత్యర్థులు అందరూ కోతులనీ అభివర్ణించారు.

అయితే సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్ట్ ను ఆ తర్వాత ఆయన తొలగించినా, తనూ, జయలలితా వివిధ సందర్భాలలో అనుకోకుండా ఎలా కలసుకున్నారో, వాటిని ఎంత ఇష్టంగా తను గుర్తు చేసుకుంటూ ఉంటారో పోస్ట్ చేయడం మాత్రం కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published.

Katju lands in trouble over his ‘1+1 offer’ to Pakistan

(Primepost Bureau)

Amidst Indo-Pak flare-up comes a whimsical relief from the inimitable former Supreme Court judge Markandey Katju. In a taunt that upset a lot of people from all walks of life, he offered a package deal to Pakistan on a social networking site: You will get Kashmir if you are ready to take Bihar as well.

What prompted the learned judge to make a 1+1 offer to our arch rival is difficult to fathom out. But he is a man who loves and lives in controversies. Clearly, his so-called ‘offer’ is an insult to Bihar state and its people and leaders. Though Katju said later it was a joke, all the hell broke loose by that time and the social media had pounced upon him.

By Wednesday, two complaints had been filed against him, including a sedition charge, in courts. Despite facing the wrath of Bihar Chief Minister Nitish Kumar and other leaders for his remarks, an undaunted Katju continued his jibes, adding fuel to the fire. In the latest Facebook post, he said: “I suggest Biharis should take their complaint against me to the UN. When ‘cheer haran’ of Draupadi was being done, she appealed to Lord Krishna to save her honour.”

Among scores of his remarks, spiked with venom and sarcasm, that spared none, the most quoted and well remembered ones  are about Indians. “Ninety per cent of Indians are idiots … that was the unpleasant truth”.  In another context, “You people don’t have brains in your heads. It is so easy to take you for a ride”.

It’s difficult to foresee when the former chairman of the Press Council of India would fire his cannon at unsuspected target. In a recent post, he called Mother Theresa “unscientific and a buffoon.” In his acerbic remarks devoid of respect for national iconic figures, Katju called Mahatma Gandhi “a British agent who did great harm to India”; Nobel Laureate Rabindranath Tagore a “loyal British stooge” and Subhas Chandra Bose “an agent of the Japanese fascist imperialists.”

Despite his spite for others, Katju seems to have an eye for beauty and pretty things. At one time, he felt Bollywood heartthrob Katrina Kaif would make a good President (because she is beautiful) and former Aam Aadmi Party convener Shazia Ilmi should have been the BJP face for Delhi CM’s post!

Of course, every time he put his foot in his mouth, Katju apologized. But he continues his onslaught. Is his a case of unlimited freedom of speech and writing?

Leave a Reply

Your email address will not be published.

“కాశ్మీర్ తో బీహార్ నూ పట్టుకుపొండి”

  • సుప్రీం మాజీ న్యాయమూర్తి మార్కండేయ్ కాట్జూ సంచలన వ్యాఖ్యలు
  • దేశద్రోహ ఆరోపణతో ఆయనను అరెస్టు చేయాలంటున్న బీహార్ పార్టీలు
  • జోగ్గా అన్నానంటున్న కాట్జూ

పాట్నా: సంచలన వ్యాఖ్యలతో తరచు వార్తల కెక్కే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మర్కండేయ్ కాట్జూ  మరోసారి తన మాటలతో మంట రాజేశారు. తాజాగా “బీహార్ ను కూడా తీసుకుంటామంటే మీకు కాశ్మీర్ ఇచ్చేస్తా”మని పాకిస్తాన్ ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యపై బీహారీలలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశద్రోహ నేరం కింద ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆయన ఆదివారం నాడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్య ఇలా ఉంది:

పాకిస్తానీల్లారా…మన వివాదానికి శాశ్వతంగా తెర దించేద్దాం. మీకు మేము కాశ్మీర్ ను ఇచ్చేస్తాం. అయితే ఒక షరతు. దాంతోపాటే మీరు బీహార్ ను కూడా తీసేసుకోవాలి. ఇదొక ప్యాకేజ్ ఒప్పందం. మీరు తీసుకుంటే మొత్తం ప్యాకేజ్ తీసుకోవాలి, లేదా ఏదీ తీసుకోకూడదు. కాశ్మీర్ ఒక్కదాన్నే మీకు ఇవ్వం. ఆగ్రాలో ముషర్రఫ్ కు అటల్ బిహారీ వాజ్ పేయి ఇదే ప్యాకేజ్ ఇవ్వబోయారు. కానీ ముషర్రఫ్ మూర్ఖంగా తిరస్కరించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆఫర్ మీ ముందుకు వస్తోంది.

దీంతో బీహార్ లోని రాజకీయపక్షాలన్నీ కాట్జూపై మండిపడుతున్నాయి. దేశద్రోహ అభియోగంతో ఆయనను అరెస్టు చేయాలని, భారత దేశ సమైక్యత, సమగ్రతలను విచ్ఛిన్నం చేయడానికి  జాతి వ్యతిరేక శక్తులు పన్నిన వలలో కాట్జూ చిక్కుకున్నారా అన్నది తెలుసుకోడానికి దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. అధికారపక్షమైన జేడీయూ కూడా కాట్జూ వ్యాఖ్యను దేశద్రోహంగా పేర్కొంటూ ఆయనపై కఠిన చర్య తీసుకోవాలంది. కాట్జూ వ్యాఖ్య మొరటుగానూ, అసహనాన్ని వెళ్ళగక్కేలానూ ఉందనీ, బీహార్ లోని పశ్చిమ చంపారన్ లో  మహాత్మా గాంధీ నిర్వహించిన సత్యాగ్రహం శతజయంతి జరుపుకుంటున్న సంవత్సరంలో ఆ స్థాయి మనిషి బీహార్ గురించి ఇలా మాట్లాడడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు కె.సి. త్యాగి అన్నారు.

ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ కూడా అయిన కాట్జూకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా విమర్శలు విజృంభిస్తున్నాయి. బీహార్ కు బదులు కాట్జూనే పాకిస్తాన్ కు అప్పజెబుతామని కొందరు వ్యాఖ్యానించారు.

విమర్శల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాట్జూ “నేనేదో జోక్ గా అన్నా” నంటున్నారు.  “బీహార్ అంటే నాకెంతో గౌరవం…బీహార్ దేశానికి ఎంతో గొప్ప సేవలు అందించింది. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు” అన్నారు.

“పాకిస్తాన్ కు నిజంగా నేనీ ఆఫర్ చేశాననుకుంటున్నారా? అబ్బే, లేదు. చాలామంది గురించి ఇలా జోక్ చేస్తూ ఉంటాను. జనం కూడా కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోవాలి” అని సూచిస్తున్నారు.

బాగానే ఉంది కానీ, ఆయన పాకిస్తాన్ కు ఈ ‘ప్యాకేజ్’ సూచించడానికి ముందే ఎవరైనా “కాట్జూగారిని పాకిస్తాన్ కు అప్పగించేస్తా”మంటే ఆయన ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో దానిని తీసుకుంటారో మరి!

బీహార్ ను స్పష్టంగా కించపరిచే ఈ వ్యాఖ్య చేసి దీనిని జోక్ గా తీసుకోవాలని ఆయన అనడం ఆశ్చర్యమే.

బీహార్ ను గురించి ఆయన ఈ కింది సంభాషణను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు:

శాంటా: ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు?

బంటా: పాకిస్తాన్.

శాంటా: పాకిస్తాన్ కు ఎవరు మద్దతు ఇస్తున్నారు?

బంటా: బీహార్.

శాంటా: ఎలా?

బంటా: జంగిల్ రాజ్ గురించిన అన్ని ఆలోచనలూ బీహార్ నుంచే పాకిస్తాన్ పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published.