సినీ బ్యూటీకి మరింత ‘ఆక్సిజన్’

పూర్వం బ్రహ్మంగారు నీరుకూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది అని చెబితే అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కుని తాగడం మనం చూస్తూనే ఉన్నాం. అలానే ఆక్సిజన్ ని కూడా కొనుక్కొని పీల్చుకోవడం అనే విధానం విదేశాల్లో వుంది, అది పూర్తి స్థాయిలో మనదేశంలో కూడా రాబోతోందని అనిపిస్తోంది. ఆక్సిజన్ ని ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో అన్ని విధాలుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మధ్య బ్యూటీని పెంచడానికి ఆక్సిజన్ తో ట్రీట్ చేసే కేంద్రాలు వచ్చేసాయి.

ప్రజల అవసరాలే వ్యాపారాలుగా మారుతుంటాయి. జనాల్లో దేనికైనా వుండే డిమాండ్ ను బట్టి బిజినెస్ స్థాయి వుంటుంది. ప్రస్తుతం వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గడంతో దాన్ని బిజినెస్ అంశంగా మలిచేసారు వ్యాపార వేత్తలు. ఆక్సిజన్ కేంద్రాలతో డబ్బు సంపాదించడమే కాకుండా ఈ వ్యాపారానికి బ్యూటీ కాన్సెప్ట్ ను కూడా జోడించేశారు. ఇప్పుడు హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీని ముంబైలో మొదలు పెట్టారు.

సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ. ఇందులో హీరోయిన్లు, హీరోలు తమ స్కిన్, హెయిర్ వంటి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మామూలు జనం  కంటే ఎక్కువగా వాటిపై వీరి శ్రద్ధ వుంటుంది. అందుకే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ సినిమా వారిని బాగా ఆకర్షించింది. ఈ థెరపీని భారత్ లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది సినీ సెలబ్రెటీలే అని చెప్పడంలో అతి శయోక్తి లేదు.

ఈ థెరపీతో చర్మం నిగనిగలాడుతుంది. టెంపరరీగా మేకప్ లతో ఫేషియల్స్ తో ట్రీట్ మెంట్ చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో సహజ విధానాలపై సెలెబ్రెటీస్ దృష్టి పెడుతున్నారు. ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీతో సహజసిద్ధంగా చర్మం ఆరోగ్యవంతమవుతుంది. ఈ కేంద్రం లో గంట ట్రీట్ మెంట్ చేయించుకున్నందుకు 20 వేల రూపాయలు ఖర్చు అవుతుందట.

Leave a Reply

Your email address will not be published.