ఆ అమల నేను కాదు మొర్రో…!

పేరు ఒకటి కాని, మనిషి వేరు! ఇలాంటి సందర్భాలలో అమాయకులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అసలు వ్యక్తి వేరు, అదే పేరుతో ఉన్న ఈ వ్యక్తి వేరు అని తెలిసే సమయానికి కొన్ని సందర్భాల్లో చాలా నష్టం జరిగిపోతుంటుంది. తాజాగా ఈ పరిస్థితి అమలకు ఎదురైంది.  తన పేరుతో ఉన్న వేరే నటులవల్ల ఈ హీరోయిన్ కు సమస్యలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులలో తాను పెద్ద వివరణే ఇచ్చుకోవలసివచ్చింది.

అమల… ఈ పేరు కొన్నాళ్ళుగా వార్తలలో హల్‌ చల్‌ చేస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడిన అమల అని మీడియాలో ఓ కథనం ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాలు,ఫేస్ బుక్ ఫ్రెండ్స్ , సోషల్ మీడియా చేయాల్సిన రచ్చంతా చేసేశారు. దీంతో పట్టుబడ్డ నటికి బదులు ఈ ఇబ్బందులుఎదుర్కొంటున్న నటి వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితివచ్చింది

మళయాళ సీరియల్స్ నటి అమల కేరళలలో వ్యభిచారం కేసులోపట్టుబడింది. మీడియాలో అమల వ్యభిచారం కేసులో పట్టుబడింది అని వార్త గుప్పుమనటంతో జనం అంతా అమలారోజ్ కురియన్ అనుకుంటున్నారట.వెంటనే ఈ అమ్మడికి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట.దాంతో… ఆమె నేను కాదు… పట్టుబడింది వేరే అమల అని వివరణ ఇచ్చుకుంటోందది. ఒక సీరియస్ పోస్తే ఫేస్ బుక్ లో పెట్టింది.

కేవలం నటన మీద ఉన్న ఇంట్రస్ట్ తోనే  ఇంకా ఇండస్ట్రీలోఉన్నా.. ఇలా అపార్థం చేసుకునే వార్తలవల్ల ఆ ఆసక్తి చనిపోతుంది.. ఇది అర్దంచేసుకోండి అని ఆ పోస్ట్ లో రాసింది. ఈ వార్తలవల్ల గత వారంరోజులుగా తనకు నిద్రకూడా పట్టడంలేదని ఆమె ప్పింది.

ఈ పరిస్థితుల్లో  ఏ ఫోన్ కాల్ వచ్చినా .. ఆ ఫోన్లో వారేమి అడుగుతారో తానేమి వివరణ ఇచ్చుకోవాలనే టెన్షన్లోనే కాలం గడిచిపోతోందట. అయితే ఈ సమయంలో కొద్దిమంది మాత్రం తనకు సపోర్ట్ గా నిలుస్తున్నారంటోంది.

Leave a Reply

Your email address will not be published.