నయనానంద తార

నిజంగా అందమైన నయనాల తార  నయనతార. అభినయ తార కూడా. నవంబర్ 18 నయనతార బర్త్ డే. ఇందువదన మధుర వచన సొగసులలరవే అన్నట్టు .. ..నయనతార  సోయగాలు, సొగసులతో, సోగ కళ్లతో అలరిస్తుంది, మెరుస్తుంది, మురిపిస్తుంది, మైమరపిస్తుంది. చంద్రముఖి సినిమాతో  మూవీల్లోకి వచ్చిన ఈ నయనాల సుందరిని  చూసిన అబ్బాయిలు అప్పుడే అబ్బా అన్నారు. అమ్మాయిలు అబ్బో అన్నారు. అలా అందరికీ కలల తార అయింది.

మొదటి మూవీనే రజనీకాంత్ చిత్రం కావడం నయనకు లక్ అని చెప్పాలి. ఆ తర్వాత ‘లక్ష్మీ’,’బాస్’  బాస్, యోగి, తులసి, దుబాయ్ శీను, అదుర్స్, సింహావంటి చిత్రాలలో అగ్ర హీరోలకు జోడీగా నటించి గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీరామరాజ్యం సినిమాతో నయనతారకు ఒక్కసారిగా పెద్ద టర్నింగ్ ఇచ్చింది.

అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకాడని నయనతార శ్రీరామరాజ్యంలో సీతగా చేయలేదు అనుకున్నారు. కానీ ఆ పాత్రను రసవత్తరంగా పోషించి, తన నటనాపటిమను నిరూపించుకుంది నయనతార. ఉత్తమ నటిగా ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం, విక్రమ్ తో ఇంకొక్కడులో నటించింది. కార్తి సినిమా కాష్మోరాలో రత్నమహాదేవిగా నటించింది.

సినిమాల్లోకి వచ్చి పదేళ్లు దాటినా  నయనతార గ్లామర్ పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. ముప్పై క్రాస్ చేసినా మిలమిలా మెరిసిపోతోంది. నయనతార కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.