కపిల్ తో సినిమానా…నో!

సినీతారల్లో చాలామంది పుకార్లను ఇష్టపడతారు. పైగా కావాలని గాసిప్స్ ను ప్రచారం చేయించుకుంటారు. బాలీవుడ్ తారల్లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఈ గాసిప్ప్ కూడా తమకు అనుకూలంగా ఉంటే ఏమనరు. పైగా ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేయడానికి కారణం ,అందులో ఎంతోకొంత ఫ్యాక్ట్ ఉండడమే. ఎప్పుడైనా అవసరమనుకుంటే తప్ప వాటిని ఖండించరు.

తెలుగు, తమిళ మూవీస్ లో చేస్తున్న తమన్నా  కొంతకాలం నుంచీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా పాగా వేయాలనుకుంటోంది. ఈ టైంలో .. .. ఆమె కపిల్ శర్మతో ఓ సినిమా చేస్తుందనే న్యూస్ వచ్చింది. ప్రచారమూ జరుగుతోంది. బాలీవుడ్ లో స్టాండ్ కావాలనుకుంటున్న మిల్కీ బ్యూటీకి ఇది అడ్వాంటేజే. కానీ ఆ న్యూస్ లో నిజం లేదని చెప్పింది తమ్మూ. కపిల్ శర్మతో తనే మూవీ చేయడంలేదని క్లారిటీ ఇచ్చింది.

కపిల్ శర్మతో  మూవీ చేస్తున్నట్టు జరిగే ప్రచారం కొన్ని రోజులవరకూ తమన్నాకు తెలీనే తెలీదు. చివరికి ఎలాగో తెలిసింది.  ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చింది.  తాను ఏదైనా సినిమాకి సైన్ చేస్తే ఆ సంగతి తప్పకుండా  చెబుతానని అంది. కపిల్ శర్మతో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అంది.

తమన్నా హిందీ సినిమా విషయం కాస్త పక్కన పెడితే .. .. ఆమె తమిళంలో విశాల్ తో చేసిన ‘కత్తి సండై’ మూవీ ‘ఒక్కడొచ్చాడు’ గా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది.  అంతేకాక .. .. తమిళంలో ఆమె చేసిన ‘ధర్మదురై’ చిత్రం అక్కడ ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను  తెలుగులో తీయాలని నిర్మాత సాంబశివరావు  అనుకుంటున్నాడు. తెలుగులో ఆ పిక్చర్ ను .. .. డాక్టర్ ధర్మరాజు ఎంబిబిఎస్ పేరుతో డబ్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.