రంభ కేసులో మరో కొత్త మలుపు

రంభ వివాదం కొత్త మలుపు తిరిగింది. భర్తతో విభేదాలు రావడంతో కొన్ని నెలలుగా భర్తకు దూరంగా వుంటున్న రంభ, రీసెంట్ గా తన భర్తతో కలిసుండే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అదే రంభ ఇవ్వాళ మరో పిటీషన్ ని కోర్టులో సమర్పించింది.

టాలీవుడ్ మాజీ హీరోయిన్ రంభ అందరికి సుపరిచితమే. చెడ్డీలేసుకున్న వాడినుండి వృద్దుల వరకు ఒకప్పుడు ఆమె హాట్ లేడీ. పెళ్ళి చేసుకుని హాయ్ గా సినిమాలకు దూరంగా వుంటుండటంతో రంభ భలే సెటిలైంది అనుకున్నారంతా. అయితే కొంత కాలంగా వారి కుటుంబ పరిస్థితులలో మార్పులు రావడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది.

నిన్నకాక మొన్న రంభ తన భర్తతో కలిసి ఉండే అవకాశాలు కల్పించాలంటూ చెన్నై‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి అనుబంధంగా మరో పిటిషన్ వేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త ఇంద్రన్ నుంచి నెలకు 2.5 లక్షలు మనోవర్తిగా ఇప్పించాలని ఆమె ఈ తాజా పిటిషన్‌లో కోరింది.

రంభ భర్తనుండి దూరంగా వుంటున్నందుకు తనకు నెలకు 1.5 లక్షలు, తన ఇద్దరు మైనర్ కుమార్తెల బాగోగులకోసం చెరి 50 వేల చొప్పున మొత్తం 2.5 లక్షలు ఇప్పించాలని పిటీషన్ లో పేర్కొంది. పెళ్ళి తరువాత సినిమాలు మానివేయడంతో ఆదాయాన్ని కోల్పోయానని అందుకే తను తన పిల్లల పోషనార్ధం మనోవర్తి ఇప్పించాలని కోరింది. కెనడాలో ఓ ఫ్యాక్టరీకి యజమాని అయిన తన  భర్త ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిపింది. కాగా ఈమె మొదట వేసిన పిటిషన్‌పై డిసెంబరు 3 న విచారణ జరగాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.