ప్రియుని ప్రమోట్ చేసే పనిలో నయనతార

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే పాటుంది. ఇప్పుడా పాటను మార్చి ప్రియురాలు అంత  సుగుణం అని పాడుకోవచ్చు. నయనతారను చూస్తే అదే అనిపిస్తుంది. ప్రేమకోసం, ప్రియుడికోసం ఏమైనా చేయడానికి  రెడీగా ఉంది నయన్. ఇప్పుడు తను ప్రేమిస్తున్న  మనిషికి మంచి కెరీర్ ఇవ్వడం కోసం కండిషన్ పెడుతోంది.

సినిమా ఫీల్డ్ లో లవ్ ఎఫైర్స్ మామూలే. కొంతకాలం ఒకరిని లవ్ చేసి, ఏవో కారణాలవల్ల విడిపోయి మరొకరిని ప్రేమించేవారూ ఉన్నారు. ఉదాహరణకు నయన తారనే తీసుకుందాం. ఆమె ఇదివరకు ప్రేమలో పడి, తర్వాత విడిపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే,  నయనతార  తను ప్రేమించిన వ్యక్తికోసం ఏమైనా చేస్తుంది.

నయనతార ఇప్పుడు తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమిస్తోంది. అతనికి మంచి కెరీర్ కల్పించే పనిలో ఉంది. అందుకు ఏంచేయాలా అని ఆలోచించిన ఈమె ఓ ఐడియా వేసింది. తనతో సినిమా చేయాలంటే డైరెక్టర్ గా తన ప్రియుడికి ఛాన్స్ ఇవ్వాలంటూ ఈ బుల్లెమ్మ కండిషన్ పెడుతోందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

తన ఐడియాను  నయనతార ఇప్పటికే అమలు చేసేసింది కూడా.  సూర్య నటించే చిత్రానికి ఆమె రికమండేషన్ వల్లే విఘ్నేశ్ కు డైరెక్టర్ గా అవకాశం వచ్చిందని అంటున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా చేసే చిత్రాన్ని నయన్ తాజాగా అంగీకరించింది. అయితే, ఆ తర్వాత  విజయ్ నటించే చిత్రానికి విఘ్నేశ్ కి  డైరెక్షన్ ఛాన్స్ఇవ్వాలని కండిషన్ పెట్టిందట.

Leave a Reply

Your email address will not be published.