నందమూరి మల్టీ స్టారర్ ‘బ్రదర్స్’

మల్టీ స్టారర్ సినిమాలు కొత్త కాదు. అయితే లేటెస్ట్ గా మల్టీ స్టారర్ మూవీ నిర్మాణంలో కొత్త ట్రెండ్ చోటుచేసుకుంటోంది. ఒకే ఫ్యామిలీ హీరోలతో మల్టీ  స్టారర్స్ వస్తున్నాయి. అదివరకు అక్కినేని కుటుంబం నుంచి మనం సినిమా వచ్చింది.  నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా మల్టీ స్టారర్ వస్తుందని అదివరకే అనుకున్నారు.  లేటెస్ట్ గా ఈ సినిమాకు బ్రదర్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

స్టార్ డమ్ ఉన్న సోలో హీరోల సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, మల్టీ స్టారర్లకూ అంత క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తే ఆ ఇద్దరి అభిమానులూ చూస్తారు. పిక్చర్ హిట్టవుతుంది. అయితే ఇప్పుడు మల్టీ స్టారర్స్ కూడా మలుపు తిరిగాయి. అదివరకు ఇద్దరు హీరోలతో  సినిమా తీసేవారు. ఇప్పుడు ఒకే యాక్టింగ్ ఫ్యామిలీ హీరోలు యాక్ట్ చేసే మల్టీస్టారర్ల ట్రెండ్ వచ్చింది. 

ఈమధ్య అక్కినేని ఫ్యామిలీ హీరోలతో  మనం సినిమా వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు నటించారు. తమ ఫ్యామిలీ హీరోలతో పిక్చర్ తీస్తే బాగుంటుందని నందమూరి బ్రదర్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సినిమా ముందడుగు వేసింది. 

నందమూరి బ్రదర్స్ నటించే ఈ సినిమా టైటిల్ ఖరారైంది.  బ్రదర్స్ అనే టైటిల్ ను ఈమధ్య  రిజిస్టర్ చేయించారు. జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ పిక్చర్ చేస్తాడనేది  ఇంతవరకు ప్రకటించలేదు. బ్రదర్ కల్యాణ్ రామ్ సినిమానే జూనియర్  చేయవచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.